చదువు వృద్దాప్యాన్ని దూరం నెడుతుందా..! అదెలాగో చదివేయండి..

| Edited By: Srikar T

Mar 04, 2024 | 5:42 PM

మంచి చదువు మనిషి మనుగడకు ఎంతో ఉపయోగపడుతుందని.. బాగా చదువుకోవాలని పెద్దలు అంటుంటారు. బాగా చదువుకుంటే ఆర్థికంగా, సమాజంలో మంచి గౌరవం అన్ని ఉంటాయి. ఇలా పిల్లలకి చిన్నప్పటి నుండి చెడు దారిలోకి వెళ్లకుండా.. మంచి దారిలోకి వెళ్ళాలని చదువు గొప్పతనం గురించి తెలిసేలా చెబుతుంటాం.

చదువు వృద్దాప్యాన్ని దూరం నెడుతుందా..! అదెలాగో చదివేయండి..
Columbia University
Follow us on

మంచి చదువు మనిషి మనుగడకు ఎంతో ఉపయోగపడుతుందని.. బాగా చదువుకోవాలని పెద్దలు అంటుంటారు. బాగా చదువుకుంటే ఆర్థికంగా, సమాజంలో మంచి గౌరవం అన్ని ఉంటాయి. ఇలా పిల్లలకి చిన్నప్పటి నుండి చెడు దారిలోకి వెళ్లకుండా.. మంచి దారిలోకి వెళ్ళాలని చదువు గొప్పతనం గురించి తెలిసేలా చెబుతుంటాం. వీటన్నింటితో పాటు బాగా చదువు కోవడం వల్ల మరో మంచి ప్రయోజనం ఉంది అని షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది కొలంబియా వర్సిటీ తాజా పరిశోధనలు.

చదువు కోవడం వల్ల మంచి లైఫ్ పొందడమే కాకుండా మనిషి ఆయుష్‎ను కూడా పెంచుతుందని తాజాగా వెల్లడైంది. దీనిపై పరిశోధనలు జరిపిన కొలంబియా వర్సిటీ కీలక విషయాలు తెలిపింది. బాగా చదువుకున్న విద్యావంతులు సాధారణ ప్రజల కంటే ఎక్కువ రోజులు జీవిస్తారని.. ఈ విద్యావంతుల్లో ముసలితనం కూడా ఆలస్యంగా వస్తుందని రీసెర్చ్ చేసిన పరిశోధనలో తేలింది.
అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీకి చెందిన మయిల్ మెన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‎కు చెందిన సైంటిస్టులు జరిపిన అధ్యయనంలో చదువుకి, ముసలితలానికి మధ్య సంబంధం ఉందని గుర్తించారు.

అమెరికాలోని ఫ్రేమింగ్ హోం సిటీలో హార్ట్ స్టడీ పేరుతో 1948 నుంచి అక్కడి ప్రజల ఆరోగ్యాలను మానిటరింగ్ చేశారు. ఈ రీసెర్చ్‎కి సంబంధించిన వివరాలు తీసుకొని కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు అనాలసిస్ చేశారు. ఈ రీసెర్చ్‎లో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. పాఠశాల విద్యను అభ్యసించడం వల్ల ముసలితనం మీద పడటం రెండు నుంచి మూడు శాతం ఆలస్యం అవుతుందని పరిశోధకులు గుర్తించారు. సాధారణ వ్యక్తుల కంటే బాగా చదువుకున్న ఉన్నత విద్యావంతుల్లో చనిపోయే ప్రమాదం 10% తక్కువగా ఉంటుందని ఈ రీసెర్చ్ లో తేల్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..