Stadium Collapse: బుల్‌ఫైట్‌ స్టేడియంలో స్టాండ్‌లు కూలి ఆరుగురు మృతి, 500 మందికి గాయాలు..

బుల్‌ ఫైట్‌ (bullfight) జరుగుతుండగా స్టేడియం కుప్పకూలింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న స్టేడియంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది

Stadium Collapse: బుల్‌ఫైట్‌ స్టేడియంలో స్టాండ్‌లు కూలి ఆరుగురు మృతి, 500 మందికి గాయాలు..
Colombia Stadium Collapse

Updated on: Jun 29, 2022 | 10:43 AM

Stadium Collapse: కొలంబియాలో (Colombia)ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటన బుల్‌ఫైట్‌ క్రీడల స్టేడియంలో జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా.. మరో 500 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 10మంది పరిస్థితి విషమంగా ఉంది. బుల్‌ ఫైట్‌ (bullfight) జరుగుతుండగా స్టేడియం కుప్పకూలింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న స్టేడియంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. భయంతో ఆడియన్స్ అరుపులు.. కేకలు.. పరుగులు. ఎవరు ఎటు వైపు వెళ్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. కుటుంబాలతో సహా స్టేడియానికి వచ్చిన వారందరు చెల్లా చెదురు అయ్యారు. వివరాల్లోకి వెళ్తే..

బోగోటాకు నైరుతి దిశలో 100 మైళ్ల దూరంలో ఉన్న కొలంబియాలోని ఎల్ ఎస్పినల్‌లో జరిగిన ఎద్దుల పోటీని వీక్షించడానికి భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఆదివారం వీక్‌ ఎండ్‌ కావడంతో  అనేక స్టాండ్‌లు నిండిపోయాయి. భారీ  సంఖ్యలో ప్రేక్షకులు తరలి వచ్చారు. ఫైట్‌ జరుగుతుండగానే అకస్మాత్తుగా ఒక వైపు మొత్తం స్టేడియా కుప్పకూలి పోయింది. ఈ ఘటనలో దాదాపు ఆరుగురు చనిపోయినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. గాయపడ్డ వారు మాత్రం 5వందలకు పైనే ఉంటారని స్థానిక అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే స్పాట్‌కు చేరుకున్న సహాయక బృందాలు.. స్టేడియం శిథిలాలను తొలగించారు. గాయపడ్డ వారిని దగ్గరలోని ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..