Climate Change 2022: ప్రపంచవ్యాప్తంగా వెంటాడుతున్న ప్రకృతి వైపరీత్యాలు.. వాతావరణ మార్పులే కారణం అంటున్న పరిశోధకులు

Climate Change 2022: క్లైమేట్‌ ఛేంజ్‌ ప్రపంచాన్ని మార్చేస్తోంది.. ఈ ఏడాది పలు దేశాల్లో అకాల వర్షాలు-వరదలు, తుఫానులు, కరువులు, వేడిగాలులు, కార్చిచ్చు ఆందోళనకు గురి చేస్తున్నాయి..

Climate Change 2022: ప్రపంచవ్యాప్తంగా వెంటాడుతున్న ప్రకృతి వైపరీత్యాలు.. వాతావరణ మార్పులే కారణం అంటున్న పరిశోధకులు
Climate Change

Updated on: Jun 30, 2022 | 8:22 AM

Climate Change: 2022 సంవత్సరం మొదటి ఆరు నెలల కాలాన్ని చూస్తే ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలల్లో వాతావరణ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమెరికాతో పాటు యూరోప్‌లోని పలు దేశాల్లో కార్చిచ్చులు సర్వసాధారణమైపోయాయి. లక్షలాది ఎకరాల అడువులు కాలిపోతున్నాయి. రుతుపవనాలతో సంబంధం లేకుండా బంగ్లాదేశ్‌తో పాటు పలు ఏసియన్‌, యూరోప్‌ దేశాల్లో అకాల వర్షాలు, వరదలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. భారీ వరదలతో వేలాది మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పసిఫిక్‌, ఆట్లాంటిక్‌,హిందూ మహాసముద్ర తీరాల్లోని అనేక దేశాల్లో తుఫానులు బీభత్సం సృష్టించాయి. దీంతో తీర ప్రాంతాలు వణికిపోతున్నాయి.

ఆఫ్రికాలోని కెన్యా, సోమాలియా ఇథోపియా, జిబూతీ ఆదితర దేశాల్లో కొద్ది సంవత్సరాలుగా వర్షాలు లేవు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో తూర్పు ఆఫ్రికా దేశాలల్లో కరువు దారుణంగా ఉండబోతోంది. దాదాపు 2 కోట్ల మంది ఆకలి కేకలతో అలమటిస్తారని ఐక్యరాజ్యసమితి ఇప్పటికే అంచనా వేసింది.. మరోవైపు యూరోప్‌, ఆసియా దేశాలలో గతంలో ఎన్నడూ లేనంతగా ఎండలు, వేడిగాలులు పెరిగిపోయాయి.. కొన్ని దేశాల్లో చెరువులు ఎండిపోతున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్‌ వార్మింగ్‌పై ఇప్పటికే అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ వాతావరణ మార్పులు ప్రపంచాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయని యూకే ఎన్విరాన్‌మెంటల్ రీసెర్చ్ సెంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇలాగే సాగితే.. మరిన్ని విపత్తులు వెంటాడుతాయని పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..