Pakistan 4th Wave: కరోనా వైరస్ రోజుకో కొత్త వేరియంట్ తో ప్రపంచ దేశాలను గజాగజావణికిస్తోంది. ఇప్పటికే మెక్సికో వంటిదేశాల్లో థర్డ్ వేవ్ విజృంభిస్తుండగా.. తాజాగా దాయాది దేశం పాకిస్థాన్ లో కోవిడ్ నాలుగు వేవ్ అడుగు పెట్టింది. గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ బాధితుల కేసులు భారీ సంఖ్యలో నమోదవుతూ.. ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా గత మూడు వారాల్లో ఈ సంఖ్య మూడు రేట్లు పెరిగింది. ఈ కేసులతో పాకిస్తాన్ లో ప్రస్తుతం పాజిటివ్ రేటు 4. 09 కి చేరుకుంది ఈ నేపథ్యంలో పాక్ ఆరోగ్య శాఖ స్పందిస్తూ.. మే 30 తర్వాత పాజిటివ్ రేటు నాలుగు శాతం దాటడం ఇదే మొదటిసారని తెలిపింది.
రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతుండడంతో అక్కడ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్తక, వ్యాపార సంస్ధలకు అనుమతులతో పాటు, పర్యాటక ప్రదేశాలకు అనుమతులు ఇవ్వడమే కేసులు భారీగా పెరగడానికి కారణమని చెప్పారు. ఇక ఇప్పటికైనా ప్రభుత్వం లాక్ డౌన్ విధించాలని.. లేదంటే.. నాలుగో వేవ్ మరింత వేగంగా విజృంభించే అవకాశం ఉందని చెప్పారు.
అయితే పాక్ లో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది.. అక్కడ విద్యా బోర్డు మాధ్యమిక, ఉన్నత మాధ్యమిక విద్యార్ఢ్యలకు పరీక్షలను నిర్వహించింది. ఇటువంటి సమయంలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం వల్ల తాజా రోజువారీ ఇన్ఫెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈద్ -అల్ అజా పండుగను కూడా పాక్ ప్రజలు పలు ఆంక్షల నడుమ జరుపుకుంటున్నారు.
గత 24 గంటల్లో పాకిస్తాన్ లో కొత్తగా కరోనా వైరస్ 1,808 కేసులు నమోదు కాగా.. ఇప్పటి వరకు ఆ దేశంలోని కరోనా బాధితుల సంఖ్య 975,092లకు చేరుకుంది. ఇక గత 24 గంటల్లో 15మంది మృతి చెందారు.. దీంతో అక్కడ మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 22,597 గా ఉంది. ఇక ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా నుంచి 913,873మంది కోలుకున్నారని ఆదేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది.
మరోవైపు పాకిస్థాన్ లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం మందకొండిగా సాగుతుంది. ఇప్పటి వరకూ కోటి 90లక్షలకు పైగా కోవిడ్ వ్యాక్సిన్ డోసులను ప్రజలకు అందించామని. అక్కడ ప్రభుతం తెలిపింది. ప్రజలు మరింత త్వరగా టీకాలు వేయించుకోవాలని సూచిస్తుంది.