CHINESE CONSPIRACY: ఆగని డ్రాగన్ కుట్రలు.. ఇండో-చైనా సరిహద్దులో భారీగా నిర్మాణాలు

|

Jun 02, 2021 | 6:42 PM

ఎవరెన్ని సుద్దులు చెబుతున్నా చైనా బుద్ది మారడం లేదు. సరిహద్దుల్లో భారత్‌ను చికాకు పెట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది డ్రాగన్ కంట్రీ. తాజాగా లైన్‌ ఆఫ్‌ యాక్చువల్ ‌​కంట్రోల్‌ వెంబడి...

CHINESE CONSPIRACY: ఆగని డ్రాగన్ కుట్రలు.. ఇండో-చైనా సరిహద్దులో భారీగా నిర్మాణాలు
Follow us on

CHINESE CONSPIRACY CONSTRUCTIONS NEAR INDO-CHINA BORDER: ఎవరెన్ని సుద్దులు చెబుతున్నా చైనా బుద్ది మారడం లేదు. సరిహద్దుల్లో భారత్‌ (BHARAT)ను చికాకు పెట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది డ్రాగన్ కంట్రీ. తాజాగా లైన్‌ ఆఫ్‌ యాక్చువల్ ‌​కంట్రోల్‌ (LAC) వెంబడి చైనా కొత్త నిర్మాణాలు మొదలుపెట్టింది. ఎల్ఏసీ వెంబడి నిర్మాణాలకు సంబంధించి ఇండియన్ ఆర్మీ ఇంటెలిజెన్స్ (INDIAN ARMY INTELLEGENCE) వర్గాలకు సమాచారం అందింది. టిబెట్‌ (TIBET), జిన్‌జియాంగ్‌ ప్రావిన్సులలో తన సైనిక కార్యకలాపాల్లో చైనా వేగం పెంచింది. ముఖ్యంగా ఇండియా (INDIA)తో సరిహద్దుగా భావిస్తున్న LAC వెంట పీపుల్స్ లిబరేషన్‌ ఆర్మీ (PEOPLE’S LIBERATION ARMY) కదలికలు ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగాయి.

ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌ ఉపయోగించుకునేలా కంబైన్డ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ (COMBINED AIR DIFFENSE SYSTEMS) నిర్మాణ పనులు శరవేగంగా చేపడుతోంది చైనా మిలిటరీ (CHINESE MILITARY). సరిహద్దు వెంట తన బలాన్ని పెంచుకునే పనిలో భాగంగా చైనా ఈ నిర్మాణాలు చేస్తోందని భారత్‌ ఆర్మీ (INDIAN ARMY) వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎయిర్‌ డిఫెన్స్‌తో పాటు మిస్సైల్స్‌ పొజిషనింగ్‌ (MISSILES POSITIONING), ఎయిర్‌పోర్టు (AIRPORT)ల నిర్మాణాలను చైనా చేపడుతోంది. పీఎల్‌ఏ (PLA)లో వెస్ట్రన్‌ థియేటర్‌ కమాండ్‌ ఎల్‌ఏసీ వెంట భద్రత విధులను నిర్వహిస్తోంది.

ప్రస్తుతం వెస్ట్రన్‌ థియేటర్‌కి సంబంధించి పది యూనిట్లు ఎల్‌ఏసీ వెంట చురుగ్గా ఉన్నట్టు సమాచారం. కంబైన్డ్‌ ఆర్మీ, ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌కి సహకారం అందిస్తున్నాయి. ఇక్కడ జరుగుతున్న పనులను ఎప్పటికప్పుడు చైనా ఎయిర్‌ఫోర్స్‌ గమనిస్తోంది. గతేడాది నుంచి తూర్పు లద్ధాఖ్‌ (EASTERN LADDAKH) ప్రాంతంలో ఇండియా, చైనాల మధ్య ఉద్రిక్తతలు క్రమంగా పెరుగుతున్నట్లు సమాచారం. ఈసారి చైనీస్ ఆర్మీతో పాటు ఆ దేశ ఎయిర్‌ఫోర్స్‌ కూడా రంగంలోకి దిగింది. ఈ పరిణామాలను భారత్‌ నిశితంగా గమనిస్తోందని ఇండియన్ ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి.

గత సంవత్సరం యావత్ ప్రపంచం ఓ వైపు కరోనాతో పోరాడుతుంటే.. చైనీస్ మిలిటరీ భారత్ భూభాగంపై కన్నేసిన సంగతి తెలిసిందే. లద్ధాక్ సమీపంలోని ఇండో-చైనీస్ బోర్డర్‌ (INDO-CHINESE BORDER) భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చింది డ్రాగన్ ఆర్మీ. ఆ భూభాగం తమదేనని క్లెయిమ్ చేసుకునేందుకు యధాశక్తి ప్రయత్నించింది. భారత సైన్యం చైనీస్ కుట్రలను తిప్పికొట్టింది. మన భూభాగం నుంచి డ్రాగన్ ఆర్మీని తరిమి కొట్టింది. అదే సమయంలో భారత దౌత్య పర్యంగాను చైనీస్ పాలకులపై ఒత్తిడి తెచ్చారు. ఎట్టకేలకు మూడు, నాలుగు నెలల తర్వాత చైనా మిలిటరీ తమ భూభాగానికి తిరిగి వెళ్ళింది. ఇదంతా జరిగి తీరా ఆరేడు నెలలు గడవక ముందే డ్రాగన్ కంట్రీ మరోసారి కుట్రలకు తెరలేపింది.

ALSO READ: చైనాపై పెరుగుతున్న ఒత్తిడి.. వైరస్ మూలాలను, వూహన్ ల్యాబును అప్పగించాలంటున్న వెస్టర్న్ మీడియా

ALSO READ: బ్రేక్ ఫాస్ట్ బిల్లులను తిరిగి చెల్లించనున్న ప్రధాని.. ఆరోపణలతో వెనక్కి తగ్గిన సన్నా మారిన్ 

ALSO READ: బెంగాల్ హింసపై సుప్రీంకు విద్యావేత్తల లేఖ.. మమత మెడకు బిగుస్తున్న ఉచ్చు