భారత్‌లో కరోనా తీవ్రంగా ఉంది… అవసరమైన సాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నాం : చైనా

|

Apr 22, 2021 | 10:47 PM

ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ కొనసాగుతోంది. ఒక వైపు వ్యాక్సినేషన్‌ కొనసాగుతుండగా, మరో వైపు దేశాన్ని అతలాకుతలం అవుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌కు అవసరమైన సహాయం

భారత్‌లో కరోనా తీవ్రంగా ఉంది... అవసరమైన సాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నాం : చైనా
China
Follow us on

ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ కొనసాగుతోంది. ఒక వైపు వ్యాక్సినేషన్‌ కొనసాగుతుండగా, మరో వైపు దేశాన్ని అతలాకుతలం అవుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌కు అవసరమైన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చైనా ప్రకటించింది. గురువారం ఆ దేశ అధికార మీడియాతో మాట్లాడిన చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ ఈ ప్రకటన చేశారు. మహమ్మారి తీవ్ర స్థాయిలో నష్టపరిచిందని, ఈ సమయంలో అంతర్జాతీయ సంఘీభావం, పరస్పరం సహాయం చేసుకోవడం అవసరమన్నారు.

ఇండియాలో ఉన్న దారుణమైన పరిస్థితుల విషయం చైనా గమనించిందని, అక్కడ తాత్కాలిక మందుల కొరత ఉన్నదని, కరోనాను అదుపులోకి తీసుకురావడానికి అవసరమైన సహాయం అందించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు.

కాగా, దేశంలో ప్రతి రోజు రికార్డుస్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా 3,14,835 కరోనా కేసులు నమోదు కాగా, 2,104 మంది మరణించారు. దేశంలో కోవిడ్ ప్రారంభం నాటినుంచి అత్యధిక కోవిడ్ -19 కేసులు మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,59,30,965 (1.59 కోట్లు) కు చేరగా.. మరణాల సంఖ్య 1,84,657 కి పెరిగింది. కేవలం 17 రోజుల్లోనే రోజువారి కేసుల సంఖ్య లక్ష నుంచి 3 లక్షల దాటడం ఈ మహమ్మారి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రపంచంలో అత్యధికంగా భారత్‌లో కేసులు నమోదయ్యాయి.

ఇవీ చదవండి: China tells India : వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి, సుస్థిరతలను కొనసాగించేందుకు తాము కట్టుబడి ఉన్నాం : చైనా

కోవిడ్ ఎఫెక్ట్, ఇండియా నుంచి వచ్చే విమానాలపై ఆస్ట్రేలియా ఆంక్షలు ? పీఎం స్కాట్ మారిసన్