China vs Taiwan: తైవాన్‌లో పెలోసీ పర్యటన రేపిన చిచ్చు కొనసాగుతోంది. ఈ ద్వీప దేశాన్ని పూర్తి స్థాయిలో దిగ్భందించే దిశగా చైనా మరింత పట్టు బిగించే ప్రయత్నాలు చేస్తోంది. తైవాన్ జలసంధిలో ఏకంగా 68 యుద్ధ విమానాలు, 14 యుద్ధ నౌకలను మొహరించింది డ్రాగన్.. చైనాకి చెందిన 20 ఎయిర్‌ఫోర్ప్ విమానాలు తమ గగణతలంలోకి వచ్చాయని, 14 యుద్ద నౌకలు సముద్రంలో విన్యాసాలు చేస్తున్నాయని తైవాన్ రక్షణ శాఖ ప్రకటించింది. మరోవైపు తైవాన్ సైతం ఎదురుదాడికి సిద్దంగా ఉన్నాయని సంకేతాలు ఇచ్చింది. చైనాకు సవాలుగా తన సత్తా చాటఏ ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో సముద్రంలో చైనా, తైవాన్ యుద్ధనౌకలు ఎదురురెదురుగా రావడం కలకలం రేపింది.
చైనా చర్యలను తాము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు తైవాన్ అధ్యక్షురాలు త్సాయి యింగ్‌వెన్. ప్రజాస్వామ్యాన్ని కాపాడే క్రమంలో అంతర్జాతీయ సమాజం తమకు అండగా నిలవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మరోవైపు తైవాన్ జలసంధిలో చైనా చేపట్టిన యుద్ద విన్యాసాలను తక్షణం నిలిపేయాలని అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు హెచ్చరించాయి. శాంతి, సుస్థిరతలను కాపాడేందుకు తామ కట్టుబడి ఉంటామని ఆ దేశాలు ప్రకటించాయి.
ఇదిలాఉంటే.. చైనా యుద్ధ విన్యాసాల కారణంగా సింగపూర్, దక్షిణ కొరియా ఎయిర్‌లైన్ సంస్థలు తమ సర్వీసులను రద్దు చేసుకున్నాయి. మరోవైపు తైవాన్ రక్షణ శాఖ రిసెర్చ్ డెవలప్‌మెంట్ డిప్యూటీ హెడ్ ఓయ్ యాంగ్ లిసింగ్ మరణానికి కారణం గుండెపోటేనని ప్రాథమిక విచారణ తేలింది. ఇక దక్షిణ చైనా సముద్రంలో ఇరు దేశాలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది ఆసియాన్ దేశాల కూటమి. నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన ప్రస్తుత ఉద్రిక్తతలకు కారణమైందని ఆసియాన్ నాయకులు విమర్శిస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..