తాలిబన్లకు చైనా మద్దతు ప్రకటించింది. ఇందుకు బదులుగా ఆఫ్ఘన్ గడ్డను చైనాకు వ్యతిరేకంగా ఎవరు వినియోగించుకోజూచినా తాము సహించబోమని తాలిబన్లు హెచ్చరించారు. అంటే ఒక విధంగా ఆఫ్ఘనిస్తాన్ లో చైనాకు వ్యతిరేకంగా జరిగే ఎలాంటి కార్యకలాపాలనూ తాము అనుమతించబోమని వారు ప్రకటించారు. వాటిని ఉక్కుపాదంతో అణచివేస్తామన్నారు. 9 మంది తాలిబన్లతో కూడిన ప్రతినిధిబృందం నిన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ ని కలుసుకుంది. చైనాలోని టియాంజిన్ లో ఈ బృందం రెండు రోజులుగా పర్యటిస్తోంది. ఈ సందర్భంగా ఆఫ్ఘన్ యుద్దాన్ని ముగించడంలో తాలిబన్లే చొరవ తీసుకోవాలని వీరే కీలక పాత్ర వహిస్తారని వాంగ్ ఈ స్పష్టం చేశారు. ఈ సమస్యకు శాంతియుత పరిష్కారాన్ని, రాజీ సూత్రాన్నీ వారు కనుగొంటారని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఆఫ్ఘన్ పునర్నిర్మాణానికి తాలిబన్లు కృషి చేస్తారని కూడా తాము భావిస్తున్నామన్నారు. ఆఫ్ఘన్ లో ఈస్ట్ తుర్కెస్తాన్ మూవ్ మెంట్ తమ దేశ భద్రతకు ముప్పుగా పరిణమిస్తోందని, దీన్ని తాలిబన్లు అణచివేయాలన్నారు. ఆఫ్ఘన్ లో తాలిబాన్లకు, ఆఫ్ఘన్ దళాలకు మధ్య పోరు ఉధృతమవుతున్న దశలో చైనా ఇలా తాలిబాన్లకు మద్దతుగా మాట్లాడ్డం గమనార్హం.
అఫంగ్జనిస్తాన్ లో శాంతి నెలకొనేందుకు యత్నిస్తున్నామని తాము చైనా విదేశాంగ శాఖ మంత్రికి స్పష్టం చేశామని తాలిబన్ల అధికార ప్రతినిధి మహమ్మద్ నయీమ్ ట్వీట్ చేశారు. చైనా అధికారుల నుంచి ఆహ్వానం అందడంతో తమ డిప్యూటీ నాయకుడు ముల్లా బరాదర్ అఖుండ్.. ఆఫ్ఘన్ లోని చైనా రాయబారిని కలుసుకున్నారని కూడా ఆయన వెల్లడించాడు. అఫనిస్థాన్ వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోబోమని, చైనా హామీ ఇచ్చిందని, అయితే సమస్యల పరిష్కారంలోను, శాంతి నెలకొనేలా చూడడంలోనూ మాకు (తాలిబాన్లకు) సాయపడతామని గట్టి వాగ్దానం చేసిందని ఆయన పేర్కొన్నాడు. ఓ వైపు ఆఫ్ఘన్ దళాలకు మద్దతుగా.. తాలిబాన్లపై వైమానిక దాడులు జరుపుతున్న అమెరికా ఇక ఏ వైఖరి అవలంబిస్తుందో చూడాల్సిందే..
మరిన్ని ఇక్కడ చూడండి : ట్రైలర్ రిలీజ్ చేసిన ఆర్జీవీ..ట్రైలర్ ఏమోగానీ ఆర్జీవీ రియాక్షన్ మాత్రం హైలెట్..:RGV reaction Video.