బుబోనిక్ ప్లేగు మరణం.. గ్రామాలను సీల్ చేసిన చైనా

బుబోనిక్ ప్లేగు మరణం.. గ్రామాలను సీల్ చేసిన చైనా

అసలే చైనా నుంచి వచ్చిన కరోనాతో ప్రపంచం మొత్తం అల్లాడుతోంది. అయితే ఈ సమయంలోనే చైనాలో బుబోనిక్ ప్లేగ్ విజృంభిస్తోంది. 

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 09, 2020 | 7:03 PM

China Seals Off Villages: అసలే చైనా నుంచి వచ్చిన కరోనాతో ప్రపంచం మొత్తం అల్లాడుతోంది. అయితే ఈ సమయంలోనే చైనాలో బుబోనిక్ ప్లేగ్ విజృంభిస్తోంది.  చైనాలోని మంగోలియాలో ఉన్న ఓ గ్రామంలో ఈ వ్యాధి సోకి ఓ వ్యక్తి చనిపోయాడు. దాంతో అలర్ట్ అయిన డ్రాగన్ ప్రభుత్వం ‌గ్రామాన్ని సీల్ చేసింది.

”ప్లేగు సోకి పలు అవయవాల వైఫల్యంతో ఓ వ్యక్తి శుక్రవారం మృతి చెందాడు. ఉత్తర చైనా ప్రాంతంలో ఈ నెలలో నమోదైన రెండో ప్లేగు కేసు ఇది. ఆ ప్రాంతంలో లాక్‌డౌన్‌ విధించాము. దీనిపై ఎపిడెమియోలాజికల్ దర్యాప్తు జరుగుతోంది” అని బవన్నాయెర్‌ హెల్త్ కమిషన్ తెలిపింది. కాగా ఈ ప్రాంతానికి ఆనుకొని ఉన్న మరో గ్రామంలో ఓ వ్యక్తి  అవయవాల వైఫల్యంతో మరణించడంతో గురువారం మొదటి లాక్‌డౌన్ విధించారు. అంతేకాదు ఈ రెండు ప్రాంతాలకు ఈ ఏడాది చివరి వరకు ప్లేగు నిరోధిత అలర్ట్ జారీ చేశారు. ఈ అలర్ట్‌ల్లో మొత్తం 4 రకాలుండగా.. చైనా మూడవ అలెర్ట్‌ని జారీ చేసింది. అంటే పరిస్థితి తీవ్రంగానే ఉన్నట్లని పలువురు భావిస్తున్నారు. ఇక ఈ అలర్ట్ వల్ల అక్కడి ప్రజలు జంతువుల్ని వేటాడటం, తినడం నిషేధం. ఎవరిలోనైనా ప్లేగ్ లక్షణాలు కనిపిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలి. కాగా శతాబ్దాలుగా ప్లేగు వ్యాధి వేలాది మంది ప్రాణాలను పొట్టనపెట్టుకున్న విషయం తెలిసిందే.

Read This Story Also: టీనేజర్‌కి బెయిల్ ఇచ్చిన హైకోర్టు.. పెట్టిన కండిషన్లు‌ తెలిస్తే షాక్‌

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu