400 మంది తాలిబన్ ఖైదీల విడుదలకు.. ఆఫ్ఘన్ అసెంబ్లీ ఆమోదం..!

సుమారు 400 మంది మరణశిక్ష పడ్డ తాలిబాన్ ఖైదీలను విడుదల చేయడానికి ఆ దేశ గ్రాండ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో ప్రభుత్వం, తాలిబన్ల మధ్య చర్చలకు మార్గం సుగమం అయింది. 25 అధికరణలతో

400 మంది తాలిబన్ ఖైదీల విడుదలకు.. ఆఫ్ఘన్ అసెంబ్లీ ఆమోదం..!
Follow us

| Edited By:

Updated on: Aug 09, 2020 | 8:02 PM

సుమారు 400 మంది మరణశిక్ష పడ్డ తాలిబాన్ ఖైదీలను విడుదల చేయడానికి ఆ దేశ గ్రాండ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో ప్రభుత్వం, తాలిబన్ల మధ్య చర్చలకు మార్గం సుగమం అయింది. 25 అధికరణలతో కూడిన తీర్మానాన్ని గ్రాండ్ అసెంబ్లీ ఆమోదించింది. ఆఫ్ఘనిస్థాన్ అంతర్గత వ్యవహారాల్లో ప్రత్యక్ష, పరోక్ష జోక్యాన్ని నిలిపివేయాలని, ఉగ్రవాద సంస్థలకు సహాయపడటం మానుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. ఆఫ్ఘనిస్థాన్ అంతర్గత చర్చలకు తక్షణమే రావాలని తాలిబన్లను దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ, మాజీ దేశాధ్యక్షుడు హమీద్ కర్జాయ్, ఇతర రాజకీయ నేతలు కోరారు.

ఆఫ్ఘన్ ప్రభుత్వం దాదాపు 5,000 మంది తాలిబాన్ ఖైదీలను విడుదల చేసింది. అధికారిక జాబితా ప్రకారం, చాలా మంది ఖైదీలు తీవ్రమైన నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, వారిలో మరణశిక్ష పడ్డవారు కూడా చాలామంది ఉన్నారు. విడుదల కాబోయే తాలిబన్ ఖైదీలు తిరిగి యుద్ధం చేయబోరని, వారి కార్యకలాపాలపై పర్యవేక్షణ ఉంటుందని ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వానికి, ప్రజలకు హామీ ఇవ్వాలని ప్రభుత్వం తెలిపింది. ఆఫ్ఘనిస్థాన్ గ్రాండ్ అసెంబ్లీలో వేలాది మంది మత పెద్దలు, సంఘ పద్దలు, రాజకీయ నేతలు ఉన్నారు. వీరంతా రాజధాని కాబూల్‌లో సమావేశమయ్యారు.

Read More:

30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు.. తొలి దశలో 15 లక్షల ఇళ్లు..!

ఆదుకున్న రబీ దిగుబడి.. రాష్ట్రానికి తప్పిన ఆహార ఇబ్బందులు..!