ప్రపంచవ్యాప్తంగా 20 మిలియన్లకు చేరువలో కరోనా కేసులు..

ప్రపంచవ్యాప్తంగా 20 మిలియన్లకు చేరువలో కరోనా కేసులు..

ప్రపంచవ్యాప్తంగా 19,834,735 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 730,210 మంది కరోనాతో చనిపోయారు. ఇదిలా ఉంటే 12,741,325 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో ప్రపంచంలో 5612 మరణాలు సంభవించాయి.

Ravi Kiran

|

Aug 09, 2020 | 5:52 PM

Coronavirus Cases In World: ప్రపంచదేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు దేశాలన్నీ కూడా దశల వారీగా లాక్ డౌన్ విధించినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ వైరస్ 213 దేశాలకు పాకింది. తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 19,834,735 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 730,210 మంది కరోనాతో చనిపోయారు. ఇదిలా ఉంటే 12,741,325 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో ప్రపంచంలో 5612 మరణాలు సంభవించాయి. అయితే మరణాల రేటు కంటే రికవరీ రేటు అధికంగా ఉండటంతో ప్రజలు కాస్త ఊరట చెందుతున్నారు.

అమెరికా, బ్రెజిల్, రష్యా దేశాల్లో కరోనా తీవ్రతరంగా ఉంది. ప్రస్తుతం అన్ని దేశాలూ లాక్ డౌన్‌ను దశల వారీగా సడలిస్తున్న నేపథ్యంలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధిక కేసులు(5,150,060), మరణాలు(165,074) సంభవించాయి. అటు బ్రెజిల్ లో పాజిటివ్ కేసులు 3,013,369 నమోదు కాగా, మృతుల సంఖ్య 100,543కు చేరింది. ఇక రష్యాలో 887,536 పాజిటివ్ కేసులు, 14,931 మరణాలు నమోదయ్యాయి. భారత్‌లో కరోనా కేసులు 2,158,408 నమోదు కాగా, మృతుల సంఖ్య 43,518కి చేరింది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu