కోవిడ్ మహమ్మారి రోజుకోలా రూపాంతరం చెందుతోంది. మరో కొత్త మహమ్మారిలా పుట్టుకొస్తోంది. వేరియంట్స్, ఫంగస్ పేరుతో భయాందోళన కలిగిస్తోంది. అయితే కరోనా ఆవిర్భవించిన చైనాలో ఆంత్రాక్స్ న్యుమోనియా కేసు ఒకటి బయట పడింది. చెంగ్డే నగరంలో ఈ కేసు వెలుగులోకి వచ్చినట్లుగా సమాచారం. దీంతో ప్రపంచమంతా మరింత భయాందోళనకు గురవుతున్నాయి.
సదరు రోగికి పశువులు, గొర్రెల ద్వారా ఆంత్రాక్స్ న్యుమోనియా వచ్చినట్టు తెలిసింది. అతనిని అంబులెన్స్‌లో బీజింగ్ తరలించి.. అక్కడ అతనికి చికిత్స చేశారు. అతనిని క్వారంటైన్‌లో ఉంచినట్లుగా అక్కడి చైనా మీడియా సెంటర్ వెల్లడించింది. ఈ మేరకు గ్లోబల్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. అనారోగ్యంతో ఉన్న పశువులు, సంపర్కం ద్వారా ఆంత్రాక్స్ సోకుతుందని తెలిపింది. ఈ మేరకు బీజింగ్ సెంటర్ ఫర్ డిసిజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తన నివేదికలో పేర్కొంది.
వైరస్ వ్యాప్తి: కేవలం ధూళి ద్వారా ఆంత్రాక్స్ న్యుమోనియా జనాలకు సోకుతుందని తెలిపారు. కలుషిత ఆహారం, మాంసం ద్వారా కూడా ఆంత్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
ప్రాథమిక లక్షణాలు: ఆంత్రాక్స్ వస్తే వికారం, వాంతులు, విరేచనాలు కలుగుతాయని వైద్య నిపుణులు తెలిపారు. ఆంత్రాక్స్ నేరుగా మనుషుల ద్వారా వ్యాపిస్తోంది. జలుబు, కరోనా మాదిరిగా అంటు వ్యాధి మాత్రం కాదని అక్కడి వైద్యులు అంటున్నారు.
ఫంగస్ ఇంపాక్ట్..
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే.
ఎస్. ఇప్పటికీ కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తూనే ఉంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ మళ్లీ పంజా విసురుతోంది. ఫస్ట్ వేవ్, తర్వాత సెకండ్‌వేవ్..ఇప్పుడు ధర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉందంటూ హెచ్చరిస్తున్నారు నిపుణులు. మరోవైపు రకరకాల వేరియంట్లు ప్రజలపై అటాక్ చేస్తూ దడ పుట్టిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి: Simple Cooking Tips: మీకు స్టిక్కీ రైస్‌ను వండటం ఎలానో తెలుసా.. ఈ వంటను చాలా రుచిగా తయారు చేయాలంటే ఇలా చేయండి…