China: చైనాలో తొలిసారి రివర్స్ పరిస్థితి.. షాక్‌కు గురిచేస్తున్న తాజా లెక్కలు..

|

Jan 18, 2023 | 12:17 PM

ప్రపంచ జనాభాలో అగ్రస్థానాన్ని ఆక్రమించిన చైనా జనాభా సంఖ్య తొలిసారి తగ్గుముఖం పట్టింది. గత ఆరు దశాబ్దాల్లో చైనా జనాభా తగ్గడం ఇదే తొలిసారి. 1961 తరువాత ఇంత భారీ స్థాయిలో చైనా జనాభా తగ్గింది లేదు.

China: చైనాలో తొలిసారి రివర్స్ పరిస్థితి.. షాక్‌కు గురిచేస్తున్న తాజా లెక్కలు..
China Population
Follow us on

ప్రపంచ జనాభాలో అగ్రస్థానాన్ని ఆక్రమించిన చైనా జనాభా సంఖ్య తొలిసారి తగ్గుముఖం పట్టింది. గత ఆరు దశాబ్దాల్లో చైనా జనాభా తగ్గడం ఇదే తొలిసారి. 1961 తరువాత ఇంత భారీ స్థాయిలో చైనా జనాభా తగ్గింది లేదు. ప్రస్తుతం చైనా మొత్తం జనాభా సంఖ్య 141.18 కోట్లు.

జనాభా తగ్గుదలకు ఆ దేశంలోనూ, మొత్తం ప్రపంచవ్యాప్తంగానూ ఉన్న ఆర్థికాంశాలే కారణంగా భావిస్తున్నారు. చైనాలో ఆరోగ్య వ్యవస్థ అస్తవ్యస్తం కావడం, ఆరోగ్య, సంక్షేమ కార్యక్రమాల కారణంగా ప్రభుత్వ ఖర్చులు పెరిగిపోతుండడంతో…ఈ ఆర్థిక సంక్షోభం ప్రభావం జనాభాపై పడినట్టు అంచనా వేస్తున్నారు. దీంతో జనాభా సంఖ్యలో భారత్‌ అగ్రస్థానానికి ఎగబాకనుంది.

ఊహించినదానికంటే వేగంగా చైనా జనాభా తగ్గింది. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం 2050 నాటికి చైనా జనాభా భారీగా తగ్గాల్సి ఉంది. అయితే అంచనాలకు మించి, మూడు రెట్లు అధికంగా చైనా జనాభా తగ్గింది. 2021 కంటే 2022 చివరి నాటికి తమ దేశ జనాభా 8.50 లక్షలు తగ్గినట్టు ఆ దేశ నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ వెల్లడించింది. జననాల రేటు తగ్గి, వయోవృద్ధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలోనే జనాభా సంఖ్యలో భారీ మార్పులు నమోదైనట్టు ప్రకటించింది. అయితే ఈ లెక్కలు చైనాలోని ప్రధాన భూభాగానికే పరిమితం. ఇక హాంకాంగ్‌, మకావ్‌ భూభాగాలతో పాటు స్థానిక విదేశీయులు ఈ గణాంకాల్లో చేరలేదు.

ఇవి కూడా చదవండి

జనాభా విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో కొన్నేళ్ళ క్రితం చైనా “ఏక సంతానం” నినాదాన్నిచ్చింది. కానీ 2016లోనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న చైనా ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలకు అనుమతిచ్చింది. అయితే దీనిపై ప్రజల్లో పెద్దగా స్పందన రాలేదు. ప్రధానంగా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినడం, అన్ని దేశాల్లో లాగానే చైనాలో సైతం పిల్లల పెంపకం భారం కావడంతో జననాల రేటు తగ్గడానికి ఓ ముఖ్య కారణంగా భావిస్తున్నారు. దీంతో భారత్‌ అత్యధిక జనాభా కలిగిన దేశంగా తొలిస్థానంలో నిలవనుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..