భారత తొలిప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం బాలల దినోత్సవంగా దేశమంతటా జరుపుకొంటున్నారు. జవహర్ లాల్ నెహ్రూ 1889 నవంబర్ 14న అలహాబాద్‌లో జన్మించారు. వీరి తండ్రి మోతీలాల్ నెహ్రూ ప్రముఖ న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధులు, కాంగ్రెస్ అధ్యక్షుడు. జవహర్ లాల్ నెహ్రూ లండన్ లో బారిస్టర్ పట్టా పొంది, 1912లో అలహాబాద్ న్యాయవాద వృత్తి ప్రారంభించారు. 1916 నుంచి కాంగ్రెస్ రాజకీయాలలో పాల్గొనడం ప్రారంభించి, 1929, 1936,1937,1951,1954లలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. గాంధీకి అభిమాన నాయకులైన నెహ్రూ స్వతంత్ర భారత ప్రధానిగా 1947 ఆగస్టు 15న బాధ్యతలు చేపట్టి 1967మే 27న మరణించారు. ఆయన మరణించే వరకు పదవిలో కొనసాగారు. దేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి పథంలోకి నడిపారు. అలీనోద్యమ నిర్మాతగా ప్రపంచ ప్రఖ్యాతి పొందారు.
వీరి కుమార్తె ఇందిరాగాంధీ, మనుమడు రాజీవ్ గాంధీ దేశ ప్రధానులుగా పదవులు చేపట్టారు. గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరి (1934), జీవిత చరిత్ర (1936), ది డిస్కవరి ఆఫ్ ఇండియా (1946) గ్రంథాలు వీరి మేధాశక్తికి నిదర్శనాలు. పిల్లలచే చాచా నెహ్రూగా అభిమానించబడిన నెహ్రూ పుట్టిన రోజున దేశమంతటా బాలల దినత్సవం ఘనంగా జరుగుతుంది.
అయితే మన భారతదేశ మొట్టమొదటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ దేశానికి ఎక్కువ కాలం ప్రధానిగా సేవలు అందించింది కూడా ఆయనే. బ్రిటిష్ పాలనలో చతికిలపడ్డ దేశాన్ని తనదైన దార్శనికత, ముందుచూపుతో పురోగతి దిశగా నడిపించారు. నెహ్రూకు పిల్లలన్నా, గులాబీలన్నా అమితమైన ప్రేమ. నెహ్రు ఎక్కడికెళ్లినా.. పిల్లలను వెతికి మరీ ఆప్యాయంగా పలకరించేవారు. వారికి కానుకలను ఇచ్చి ఉత్సాహపరిచేవారు. ప్రధాని కాకముందు స్వతంత్ర పోరాటంలో భాగంగా ఆయన పలుమార్లు జైలు జీవితం అనుభవించారు. పిల్లలంటే ఎంతో ఇష్టమైన నెహ్రుకు తన కుమార్తె ఇందిర అంటే ఎనలేని అభిమానం. అందుకే ఆయన జైలు గోడల మధ్య నుంచి ఆమెకు అనేక ఉత్తరాలు రాసేవారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి