వంటింట్లో కారును దాచేశాడు
ఎవరైనా కొత్తకారు కొంటే అపురూపంగా చూసుకోవడం సహజం. గ్యారేజీ ఉంటే అక్కడ భద్ర పరుస్తారు.. లేదంటే పార్కింగ్ ప్లేస్‌లో కవర్ కప్పి కాపాడుకుంటారు. కానీ ఫ్లోరిడాకు చెందిన ప్యాట్రిక్ మాత్రం తాను కొత్తగా కొన్న స్మార్ట్ కారును వంటింట్లో దాచుకున్నాడు.. తాజాగా ఫ్లోరిడాను చుట్టు ముట్టిన డోరియన్ తుఫాను ధాటి నుంచి కారును కాపాడుకునేందుకే ఈ పని చేశాడట ప్యాట్రిక్.. ఆయన చేసిన పనిపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.. కారును కిచెన్లో దూర్చిన మీ డ్రైవింగ్ […]

ఎవరైనా కొత్తకారు కొంటే అపురూపంగా చూసుకోవడం సహజం. గ్యారేజీ ఉంటే అక్కడ భద్ర పరుస్తారు.. లేదంటే పార్కింగ్ ప్లేస్‌లో కవర్ కప్పి కాపాడుకుంటారు. కానీ ఫ్లోరిడాకు చెందిన ప్యాట్రిక్ మాత్రం తాను కొత్తగా కొన్న స్మార్ట్ కారును వంటింట్లో దాచుకున్నాడు.. తాజాగా ఫ్లోరిడాను చుట్టు ముట్టిన డోరియన్ తుఫాను ధాటి నుంచి కారును కాపాడుకునేందుకే ఈ పని చేశాడట ప్యాట్రిక్.. ఆయన చేసిన పనిపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.. కారును కిచెన్లో దూర్చిన మీ డ్రైవింగ్ నైపుణ్యం అపురూపం.. గుడ్ ఐడియా అంతా కొందరు ఆడుకుంటున్నారు..