Rishi Sunak: బ్రిటన్‌ ప్రధాని నివాసంపై దాడి.. గేటును ‘ఢీ’కొన్న కారు.. రిషి సునక్ సేఫ్‌

|

May 26, 2023 | 8:49 AM

బ్రిటీష్ ప్రధాని రిషి సునక్ అధికారిక నివాసం లండన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్ గేట్‌ను ఓ వ్యక్తి కారుతో ఢీ కొట్టాడు. సదరు వ్యక్తి ప్రమాదకంగా కారు డ్రైవింగ్ చేస్తూ గురువారం సాయంత్రం గేటును ఢీ కొట్టాడు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు..

Rishi Sunak: బ్రిటన్‌ ప్రధాని నివాసంపై దాడి.. గేటును ఢీకొన్న కారు.. రిషి సునక్ సేఫ్‌
UK PM Rishi Sunak
Follow us on

బ్రిటీష్ ప్రధాని రిషి సునక్ అధికారిక నివాసం లండన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్ గేట్‌ను ఓ వ్యక్తి కారుతో ఢీ కొట్టాడు. సదరు వ్యక్తి ప్రమాదకంగా కారు డ్రైవింగ్ చేస్తూ గురువారం సాయంత్రం గేటును ఢీ కొట్టాడు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు. సంఘటన జరిగిన సమయంలో సునక్ తన కార్యాలయంలో ఉన్నారు. షెడ్యూల్‌ సమయం కంటే ముందుగా రిషి సునక్‌ కార్యాలయం నుంచి నిష్క్రమించారు. కొద్ది సమయం వరకు అధికారులెవ్వరూ బయటికి రావద్దంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఈ వీధిలోని వాహనాల రాకపోకలను నిలిపి వేశారు. ఇంకా ఎవరైనా దుండగులు ఉన్నారేమోనని సిబ్బంది తనిఖీలు చేపట్టారు. అనుమానించాల్సిన పరిస్థితులేమీ లేకపోవడంతో దిగ్బంధనాన్ని తొలగించారు. అతర్వాత ప్రధానమంత్రి కార్యాలయం వద్ద కాపలా కట్టుదిట్టం చేశారు.

‘గురువారం సాయంత్రం సుమారు 4:20 గంటల సమయంలో వైట్‌హాల్‌లోని డౌనింగ్ స్ట్రీట్ గేట్‌లను కారు ఢీకొట్టింది. సాయుధ అధికారులు సంఘటన స్థలంలో ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఎవరికీ ఎలాంటి గాయాలు అవలేదు. విచారణ కొనసాగుతోంది’ అని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.