Bulgaria Bus Fire: బల్గేరియాలో ఘోర రోడ్డుప్రమాదం.. కాలిబూడిదైన టూరిస్టు బస్.. 45 మంది సజీవదహనం

|

Nov 23, 2021 | 5:58 PM

బల్గేరియాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తోన్న ఓ బస్సు అగ్ని ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో 45మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతయ్యారు.

Bulgaria Bus Fire: బల్గేరియాలో ఘోర రోడ్డుప్రమాదం.. కాలిబూడిదైన టూరిస్టు బస్.. 45 మంది సజీవదహనం
Bulgaria Bus Accident
Follow us on

Bulgaria Bus Fire in Road Accident: బల్గేరియాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తోన్న ఓ బస్సు అగ్ని ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో 45మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతయ్యారు. మృతుల్లో 12 మంది చిన్నారులు కూడా ఉన్నారు. మరో ఏడుగురు ప్రయాణికులు మాత్రం ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు తెలిపారు. రాజధాని సోఫియాకు దక్షిణాన 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోటర్‌వేలో తెల్లవారుజామున 2 గంటలకు జరిగిన ఈ ప్రమాదం జరిగి 45 మరణించారని ఆ దేశ విపత్తు నియంత్రణ సేవ అధిపతి నికోలాయ్ నికోలోవ్ చెప్పారు. ఏడుగురు ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. గాయపడ్డవారిని రాజధానిలోని ఆసుపత్రికి తరలించారని నికోలోవ్ చెప్పారు. వారిలో ఇద్దరు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఐదుగురు చిన్నారులు ఉన్నారు.

బల్గేరియా రాజధాని సోఫియా నుంచి పర్యాటకులతో బయలుదేరిన ఓ బస్సులో అర్ధరాత్రి 2గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బస్సు మొత్తం వ్యాపించడంతో అందులో ఉన్న 45మంది ప్రాణాలు కోల్పోయారు. బస్సులో మృతదేహాలు ఓ కుప్పగా.. బూడిదగా మారాయని బల్గేరియా మంత్రి బోక్యో రష్కోవ్‌ పేర్కొన్నారు. ఇలాంటి భయానక ఘటనను ఇదివరకెన్నడూ చూడలేదన్న ఆయన.. ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. అగ్ని ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించిన అక్కడి పోలీసులు.. సాంకేతిక లోపంతో జరిగిందా? లేక డ్రైవర్‌ తప్పిదమా? అనే రెండు కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నామని చెప్పారు. ఈ దుర్ఘటనపై బల్గేరియా ప్రధానమంత్రి స్టీఫెన్‌ యానెవ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే తీసిన ఫోటోలు ఘటనా స్థలం నుంచి దట్టమైన, నల్లటి పొగలు కమ్ముకోవడంతో బస్సులో మంటలు చెలరేగాయి. నార్త్ మెసిడోనియాలో రిజిస్టర్ అయిన ఈ బస్సు ఇస్తాంబుల్ నుంచి స్కోప్జే వెళ్తోందని పోలీసులు తెలిపారు. కాగా, యూరోపియన్ కమిషన్ డేటా ప్రకారం, 2019లో 7 మిలియన్ల EU దేశమైన బల్గేరియా, 27-దేశాల కూటమిలో రెండవ అత్యధిక రోడ్డు మరణాల రేటు నమోదు చేసుకుంది. ప్రతి మిలియన్ జనాభాకు 89 మంది మరణించారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

Read Also….  Hyderabad: మరో ఘోరం.. భర్తకు మ‌ద్యం తాగించి భార్యపై అత్యాచారం.. ఆ తర్వాత దారుణంగా..