Brahmaputra River: కంత్రీ పనులు ఆపని డ్రాగన్ కంట్రీ.. ఈశాన్య భారతం మునిగేలా.. బ్రహ్మపుత్ర నదిపై సూపర్ డ్యామ్ నిర్మాణానికి వ్యూహాలు

|

Aug 05, 2024 | 11:19 AM

బ్రహ్మపుత్ర నదిపై భారీ జలవిద్యుత్‌ ప్రాజెక్టును నిర్మించేందుకు చైనా మరోసారి పావులు కదుపుతోందా?. సూపర్ డ్యామ్ గురించి ఆస్ట్రేలియన్‌ స్ట్రాటజిక్ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ నివేదికలో ఏం చెప్తోంది. అవును భారత్‌కు నష్టమని తెలిసినప్పటికీ.. బ్రహ్మపుత్ర నదిపై భారీ జలవిద్యుత్‌ కేంద్రం నిర్మాణానికి రెడీ అవుతోంది. గత కొన్నాళ్లుగా ఈ వ్యవహారంపై స్తబ్దుగా ఉన్న చైనా.. తాజాగా మరోసారి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం దిశగా వ్యూహాలు రచిస్తోంది. దీనికి సంబంధించి ఆస్ట్రేలియన్‌ స్ట్రాటజిక్ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ ఓ నివేదిక విడుదల చేసింది. చైనా ఎత్తుగడలకు సంబంధించిన కీలక అంశాలను ఏఎస్‌పీఐ తన నివేదికలో పొందుపరిచింది. భారత్‌లోకి ప్రవేశించే ముందు అంటే అరుణాచల్ ప్రదేశ్ చేరుకోవడానికి ముందు బ్రహ్మపుత్ర నది .. అర్ధచంద్రాకారంలో వంగి ప్రవహిస్తోంది.

Brahmaputra River: కంత్రీ పనులు ఆపని డ్రాగన్ కంట్రీ.. ఈశాన్య భారతం మునిగేలా.. బ్రహ్మపుత్ర నదిపై సూపర్ డ్యామ్ నిర్మాణానికి వ్యూహాలు
Super Dam' On Brahmaputra
Follow us on

సమయం దొరికినప్పుడల్లా భారత దేశంపై విషం చిమ్ముతూనే ఉంది డ్రాగన్ కంట్రీ. వ్యూహాత్మక ప్రాంతాల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. సరిహద్దుల వద్ద తమ ఆగడాలు సాగడం లేదని భావించిన చైనా ఇప్పుడు బ్రహ్మపుత్ర నదిపై ఫోకస్ పెట్టింది. ఈశాన్య భారత దేశాన్ని ముంచెత్తే వరదలను తీసుకురాగల భారీ జలవిద్యుత్ ప్రాజెక్ట్‌ను సిద్ధం చేస్తోంది. బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న సూపర్ డ్యామ్‌కు సంబంధించి ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ (ASPI) తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.

అవును భారత్‌కు నష్టమని తెలిసినప్పటికీ.. బ్రహ్మపుత్ర నదిపై భారీ జలవిద్యుత్‌ కేంద్రం నిర్మాణానికి రెడీ అవుతోంది. గత కొన్నాళ్లుగా ఈ వ్యవహారంపై స్తబ్దుగా ఉన్న చైనా.. తాజాగా మరోసారి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం దిశగా వ్యూహాలు రచిస్తోంది. దీనికి సంబంధించి ఆస్ట్రేలియన్‌ స్ట్రాటజిక్ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ ఓ నివేదిక విడుదల చేసింది. చైనా ఎత్తుగడలకు సంబంధించిన కీలక అంశాలను ఏఎస్‌పీఐ తన నివేదికలో పొందుపరిచింది. భారత్‌లోకి ప్రవేశించే ముందు అంటే అరుణాచల్ ప్రదేశ్ చేరుకోవడానికి ముందు బ్రహ్మపుత్ర నది .. అర్ధచంద్రాకారంలో వంగి ప్రవహిస్తోంది. ఈ వంపు ప్రాంతంలో సూపర్ డ్యాం నిర్మించేందుకు చైనా పావులు కదుపుతోందని ఏఎస్పీఐ నివేదికలో తెలిపింది.

మరోవైపు ఈ నది ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్‌ప్రదేశ్‌లో ప్రవేశించడానికి ముందు సుమారు 3,000 మీటర్ల దిగువకు ప్రవహిస్తోంది. ఇక్కడ ప్రాజెక్టు నిర్మిస్తే భౌగోళికంగా చైనాకు అనుకూలంగా ఉంటుందని పేర్కొంటుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేసే వీలుండటంతో ఇక్కడే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని చైనా భావిస్తోంది. ప్రపంచలోనే అత్యంత శక్తివంతమైన జలవిద్యుత్‌ ప్రాజెక్టుగా దీనిని డ్రాగన్ అభివర్ణిస్తోంది. అందుకే ఈ ప్రాజెక్ట్ ను “సూపర్ డ్యామ్” అని అభివర్ణిస్తోంది.

ఇవి కూడా చదవండి

టిబెట్‌లో జన్మించే బ్రహ్మపుత్ర నది భారత్‌ గుండా బంగ్లాదేశ్‌లోకి ప్రవహిస్తోంది. మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు బ్రహ్మపుత్ర వరదాయిని కాగా.. వర్షాకాలంలో బ్రహ్మపుత్ర నదికి విపరీతంగా వరదలు వస్తుంటాయి. ఈ వరదలు ముఖ్యంగా బంగ్లాదేశ్‌లో అపారనష్టాన్ని కలగజేస్తాయి. ఒప్పందం ప్రకారం మే 15 నుంచి అక్టోబరు 15వ తేదీ వరకు బ్రహ్మపుత్ర జలసంబంధ విషయాల్ని ఎగువనున్న చైనా దిగువనున్న భారత్‌తో పంచుకోవాల్సి ఉంది.

2002 బ్రహ్మపుత్ర నది ఒప్పందం

బ్రహ్మపుత్ర నదికి సంబంధించి భారతదేశం.. చైనాల మధ్య చారిత్రక ఒప్పందం ఉంది. 2002లో సంతకం చేసిన ఈ ఒప్పందం ప్రకారం బ్రహ్మపుత్ర నదికి సంబంధించిన వివిధ రకాల సమాచారాన్ని భారత్‌తో పంచుకోవాలని చైనాను ఆదేశించింది. చాలా సంవత్సరాల తర్వాత ఒప్పందం 2008, 2013, 2018లో పునరుద్ధరించబడింది. ఈ ఒప్పందం ఐదు ఏళ్లు కాలానికి జరిగింది. దీంతో ప్రస్తుతం ఈ ఒప్పందం 2023లో ముగిసింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నందున అది పునరుద్ధరించబడలేదు.

భారతదేశానికి సంభావ్య బెదిరింపులు ఎందుకంటే

ఈ సూపర్ డ్యామ్ నిర్మాణం పూర్తి అయితే భారతదేశానికి గణనీయమైన ముప్పు ఏర్పడుతుంది. డ్యామ్ నుంచి చైనా పెద్ద ఎత్తున నీటిని విడుదల చేస్తే అరుణాచల్ ప్రదేశ్‌లో తీవ్ర వరదలు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు భారతదేశానికి గణనీయమైన నష్టాన్ని కలిగుతుంది. చైనా విస్తృత వ్యూహంలో భాగంగానే అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో ఈ చర్య అని ASPI నివేదిక సూచిస్తుంది

చైనా నిర్మించనున్న ఈ ఆనకట్ట భారత సరిహద్దు నుండి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉంది,. అప్పుడు అది ఏ సమయంలోనైనా “వాటర్ బాంబ్” వలె అధిక మొత్తంలో నీటిని విడుదల చేయగల సామర్థ్యాన్ని ఇస్తుంది. అలా నీటి మట్టం పెరిగితే అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌లలో తీవ్ర విధ్వంసం కలిగిస్తుంది. దిగువ ప్రాంతాలకు భయంకరమైన ముప్పు కలిగిస్తుంది.

 

మరిన్ని అంతర్జతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..