Intel: 18,000 మంది ఉద్యోగులను తొలగిస్తాం.. యూఎస్ కంపెనీ సంచలన ప్రకటన
అమెరికా చిప్‌ల తయారీ దిగ్గజం ఇంటెల్ కంపెనీ సంచలన ప్రకటన చేసింది. కంపెనీ కార్యకలాపాల క్రమబద్ధీకరణలో భాగంగా 15 శాతానికి పైగా ఉద్యోగులను తగ్గించుకోబోతున్నట్టు గురువారం వెల్లడించింది. ఇటీవల ముగిసిన త్రైమాసికంలో కంపెనీ సుమారు 1.6 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసిన నేపథ్యంలో ఈ ఏడాది వ్యయాలను సుమారు 20 బిలియన్ డాలర్ల మేర కుదించుకునేలా ప్రణాళికలు రూపొందించుకున్నామని తెలిపింది.
అమెరికా చిప్‌ల తయారీ దిగ్గజం ఇంటెల్ కంపెనీ సంచలన ప్రకటన చేసింది. కంపెనీ కార్యకలాపాల క్రమబద్ధీకరణలో భాగంగా 15 శాతానికి పైగా ఉద్యోగులను తగ్గించుకోబోతున్నట్టు గురువారం వెల్లడించింది. ఇటీవల ముగిసిన త్రైమాసికంలో కంపెనీ సుమారు 1.6 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసిన నేపథ్యంలో ఈ ఏడాది వ్యయాలను సుమారు 20 బిలియన్ డాలర్ల మేర కుదించుకునేలా ప్రణాళికలు రూపొందించుకున్నామని తెలిపింది. ముఖ్యమైన ఉత్పత్తి, ప్రాసెస్ టెక్నాలజీ పరంగా లక్ష్యాలను చేరుకున్నప్పటికీ రెండవ త్రైమాసికంలో కంపెనీ ఆర్థిక పనితీరు నిరాశాజనకంగా ఉందని ఆ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పాట్ గెల్సింగర్ తెలిపారు. ఆర్థిక సంవత్సరం రెండవ అర్ధభాగంలో పరిస్థితులు మరింత సవాళ్లతో కూడి ఉంటాయని భావిస్తున్నట్టు చెప్పారు.
కాగా ఇంటెల్ కంపెనీలో గత ఏడాది చివరి నాటికి 1,24,800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 15 శాతం మందిని తొలగిస్తే దాదాపు 18,000 మందిపై ప్రభావం పడొచ్చని అంచనా. ప్రత్యర్థులు ఎన్వీడియా, ఏఎమ్‌డీ మరియు క్వాల్‌కామ్‌ల నుండి బలమైన సవాళ్లను ఎదుర్కొంటున్నామని ప్రకటించిన నెల తర్వాత ఈ కఠిన నిర్ణయాలు వెల్లడించింది. కృత్రిమ మేధ విప్లవం సరికొత్త సాంకేతికతలను ఆవిష్కరించడంతో ఆ కంపెనీకి మార్కెట్‌లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని దశాబ్దాలపాటు ల్యాప్‌టాప్‌ల నుంచి డేటా సెంటర్‌ల వరకు ఇంటెల్ చిప్‌ల ఆధిపత్యం చెలాయించింది. అయితే ఈ మధ్యకాలంలో ఆ కంపెనీకి పోటీ పెరిగిపోయింది. ఎన్వీడియా, ఏఎమ్‌డీ, క్వాల్‌కామ్‌ల నుంచి ఆ కంపెనీకి గట్టి పోటీ ఎదురవుతోంది. ముఖ్యంగా ఏఐ ప్రాసెసర్‌ల మీద ప్రత్యేక దృష్టిసారించిన ఎన్వీడియా నుంచి ఇంటెల్ కంపెనీకి మార్కెట్‌లో పోటీ ఎదురవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

