భారత, చైనా దేశాల మధ్య సఖ్యత, సహకారం పెంపొందాలని ఉభయ దేశాలూ నిర్ణయించాయి. షాంగై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యాన తజికిస్తాన్ లో జరిగిన విదేశాంగ మంత్రుల సమావేశంలో ఈ మేరకు ఒడంబడిక కుదిరిందని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ట్వీట్ చేశారు. చైనా విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి వాంగ్ ఈ తో తాను సుమారు గంటకు పైగా చర్చించానని, ప్రస్తుతం ఉభయ దేశాల సరిహద్దుల్లో ఉన్న యథాతథ పరిస్థితిని ఏకపక్షంగా మార్చే బదులు అక్కడ మరింత శాంతి, సుస్థిరత కొనసాగేలా చూడాల్సి ఉందని అభిప్రాయపడ్డామని ఆయన తెలిపారు. లడాఖ్ నియంత్రణ రేఖ వద్ద ప్రస్తుతం పరిస్థితి సంతృప్తికరంగానే ఉందని..పాంగంగ్ సరస్సు వద్ద రెండు దేశాల సైనిక ఉపసంహరణ గురించి కూడా తాము చర్చించామని ఆయన పేర్కొన్నారు. త్వరలో భారత-చైనా దేశాల సీనియర్ కమాండర్ల మధ్య మళ్ళీ ఉన్నత స్థాయి చర్చలు జరగనున్నాయని, ఇందుకు ఉభయులం ఓ అంగీకారానికి వచ్చామని ఆయన వెల్లడించారు. గత ఏడాది సెప్టెంబరులో మాస్కోలో తమ మధ్య జరిగిన సమావేశాన్ని కూడా జైశంకర్ గుర్తు చేశారు.
నాటి చర్చలను మరింత ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించామన్నారు. కాగా లడాఖ్ సరిహద్దుల్లో భారత-చైనా సైనిక దళాల మధ్య మళ్ళీ ఉద్రిక్తతలు రేగాయని వచ్చిన వార్తను ఇండియన్ ఆర్మీ ఖండించింది. నిజానికి ఇది నిరాధారమైన వార్త అని, ఆ ప్రాంతంలో యధాతథ పరిస్థితి కొనసాగుతోందని స్పష్టం చేసింది. చైనా దళాలు భారత భూభాగంలో కొంతమేర ముందుకు చొచ్చుకు వచ్చాయన్నది వాస్తవం కాదని సైనిక వర్గాలు పేర్కొన్నాయి. అయినా పరిస్థితిని మన జవాన్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని, అప్రమత్తంగా ఉన్నారని వివరించింది.
మరిన్ని ఇక్కడ చూడండి : రామయ్య నువ్వు రావాలయ్యా..!క్లిష్ట పరిస్థితుల్లో రామయ్యె రామబాణం అంటూ ఫ్యాన్స్ స్వాగతం.:Jr.NTR ReEntry Politics Live Video.
భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం..! జలమయంగా మారిన మహానగరం..:Heavy Rains Live Video.