అఫ్ఘానిస్తాన్‌లో బాంబు పేలుడు జరిగింది. కుందుజ్ నగరంలోని షియా మసీదులో జరిగిన పేలుడులో అనేక మంది గాయపడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం కుందుజ్ ప్రావిన్స్ రాజధాని బందర్‌లోని మాషియా స్వదేశీయుల మసీదులో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో అనేక మంది మరణించారు. చాలా మంది గాయపడ్డారని తాలిబాన్ ప్రధాన ప్రతినిధి జబిహుల్లా ముహాజిద్ అన్నారు.
ప్రార్థనల సమయంలో పేలుడు జరిగినట్లు తెలిపారు. ఈ పేలుడు సంబంధించి సోషల్ మీడియాలో వీడియోలు వస్తున్నాయి. అవి నిజమని ఇప్పుడే చెప్పలేన్నారు. శుక్రవారం ముస్లింలకు పవిత్రదినం కావటంతో మసీదుకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చినట్లు తెలిసింది. ఎంత మంది చనిపోయారనేది తెలియాల్సి ఉంది. ఇటీవలి కాలంలో కాబూల్‌లోని మసీదులో దాడులు జరిగాయి.
Meanwhile deadly blast reported in a Shi’ite mosque in KhanAbad, #Kunduz some minutes ago. Very little doubt that it’s ISKP. #Afghanistan
— Hemat Mohammad همت محمد (@Mohammadwardak6) October 8, 2021
Reda Also.. Afghan: భయాందోళన మధ్య కాలక్షేపం.. బోటింగ్ చేస్తూ సేదతీరుతున్న ఆఫ్ఘన్ ప్రజలు.. ఎక్కడంటే..?