Barack Obama Happy Birthday: అమెరికా అధ్యక్ష బాధ్యతలను రెండు దఫాలు నిర్వర్తించిన బరాక్ ఒబామా పాలన ఆ దేశ చరిత్రంలో చెరగని ముద్ర వేసిందనే చెప్పాలి. రికవరి యాక్ట్, అఫోర్డబుల్ కేర్ యాక్ట్, టెర్రరిజం కట్టడికి చర్యలు, బిన్ లాడెన్‌ని అంతమొందించే అపరేషన్ అన్ని బరాక్ హయాంలో జరిగినవే. ఆగస్ట్ 4న తన 61వ పుట్టిన రోజును జరుపుకుంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్.. ఇతర దేశాలతో ఆయన సంబంధాలు ఎలా ఉన్నా భారతదేశంలో ఆయన పర్యటన, ఆధునిక భారతదేశం సాధించిన విజయాలపై ఏ ప్రామిస్డ్ ల్యాండ్‌లో ఏం రాసుకున్నది ఈ రోజు ఒకసారి చూద్దాం.
మన్మోహన్ సింగ్ అపార జ్ఞాని
భారతదేశంలో రాజకీయ కుట్రలు, ప్రభుత్వాల మార్పు, సాయుధ వేర్పాటు ఉద్యమాలు, అవినీతి ఎంత ఉన్నా అధునిక భారత్ సాధించిన విజయాలు ఒక విజయగాథగా చెప్పుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. 1990లో వచ్చిన ఆర్థిక సంస్కరణలు ప్రపంచానికి భారత్ సమర్థ్యాన్ని పరిచయం చేశాయన్నారు. ప్రపంచలో తనను ప్రభావితం చేసిన, వివిధ దేశాల్లో పర్యటనల సందర్భంగా కలిసిన నేతల గురించి ఒబామా తన పుస్తకంలో వివరించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ఒబామా ప్రశంసల వర్షం కురిపించారు. సిక్కు మైనార్టీ వర్గానికి చెందిన డాక్టర్ మన్మోహన్ సింగ్ దేశ ప్రధాన మంత్రి పదవిని అందుకోవడం భారత పురోగతికి ఒక తార్కాణమని అభిప్రాయపడ్డారు ఒబామా. ఢిల్లీలో మన్మోహన్ సింగ్‌ను కలిసినప్పుడు ఆయనలోని అపార జ్ఞానాన్ని, హుందాతనాన్ని గుర్తించానని అన్నారు. సోనియాగాంధీ మాట్లాడటం కంటే ఎదుటి వ్యక్తి చెప్పింది వినేందుకే ఎక్కువ ఇష్టపడేవారని, రాహుల్ గాంధీతో సమావేశం సందర్భంగా ఆయనలోని అపరిపక్వతను గమనించానని, స్కూల్‌లో టీచర్ వద్ద మంచి మార్కులు కొట్టేయాలని చూసే విద్యార్థిలా అనిపించారని అన్నారు.
నా మనసులో ప్రత్యేక స్థానం..
రెండువేల విభిన్న జాతులు, 700లకు పైగా భాషలు కలిగి ఉన్న భారతదేశానికి తన మనసులో ప్రత్యేక స్థనం ఉందని ఒబామా తన పుస్తకంలో రాసుకొచ్చారు. తన బాల్యంలో రామాయణం, మహాభారతం వంటి హిందూ ఇతిహాస కథలను వింటూ పెరిగానని గుర్తు చేసుకున్నారు. చిన్నతనం అంతా ఇండోనేషియాలో రామాయణం, మహాభారతం వింటూ గడిపానన్నారు.
Read this also: భారత్‌పై వ్యాఖ్యలతో ఇమ్రాన్ ఖాన్ నవ్వులపాలు.. విషయం తెలిస్తే మీరూ నవ్వుకుంటారు – Watch Video
Joe Biden: వ్యాక్సిన్ల తయారీలో ఇండియాకు మాదే ఆపన్న హస్తం..అమెరికా అధ్యక్షుడు జోబైడెన్