Canada: కెనడాలో హిందూ దేవాలయంపై మళ్లీ దాడి.. బాప్స్ ఆలయన్ని ధ్వంసం చేసిన ఖలిస్తానీ మద్దతుదారులు

|

Jul 23, 2024 | 3:01 PM

హిందూ-కెనడియన్ కమ్యూనిటీలపై పెరుగుతున్న విద్వేషం, హింస ఘటనలపై నేపియన్ ఎంపీ చంద్ర ఆర్య తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎడ్మంటన్‌లోని హిందూ దేవాలయం బిఎపిఎస్ స్వామినారాయణ ఆలయం మళ్లీ ధ్వంసమైందని ఆయన మంగళవారం ట్వీట్ చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా గ్రేటర్ టొరంటో ఏరియా, బ్రిటిష్ కొలంబియా, కెనడాలోని ఇతర ప్రదేశాల్లోని హిందూ దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి.

Canada: కెనడాలో హిందూ దేవాలయంపై మళ్లీ దాడి.. బాప్స్ ఆలయన్ని ధ్వంసం చేసిన ఖలిస్తానీ మద్దతుదారులు
Hindu Temple Vandalised
Follow us on

కెనడాలో మరోసారి హిందూ దేవాలయంపై దాడి జరిగింది. ఎడ్మంటన్‌లో హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేశారు. అలాగే ఆలయ గోడలపై హిందూ ఫోబిక్ కుడ్యచిత్రాలను చిత్రించారు. దీంతో ఖలిస్తానీ మద్దతుదారులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కెనడాకు చెందిన విశ్వహిందూ పరిషత్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. ఈ తీవ్రవాద భావజాలంపై కఠిన చర్యలు తీసుకోవాలని కెనడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

హిందూ-కెనడియన్ కమ్యూనిటీలపై పెరుగుతున్న విద్వేషం, హింస ఘటనలపై నేపియన్ ఎంపీ చంద్ర ఆర్య తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎడ్మంటన్‌లోని హిందూ దేవాలయం బిఎపిఎస్ స్వామినారాయణ ఆలయం మళ్లీ ధ్వంసమైందని ఆయన మంగళవారం ట్వీట్ చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా గ్రేటర్ టొరంటో ఏరియా, బ్రిటిష్ కొలంబియా, కెనడాలోని ఇతర ప్రదేశాల్లోని హిందూ దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. ద్వేషపూరితమైన వ్యక్తులు ఇంతటి దారుణాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. అంతేకాదు మరోవైపు కెనడాలో ఖలిస్తానీలు తమ సొంత కోర్టును ఏర్పాటు చేసుకుంది. ఈ విషయంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది

ఇవి కూడా చదవండి

హిందూ దేవాలయాలపై విధ్వంసం జరగడం ఇదే మొదటిది సారి కాదు

కెనడాలోని హిందూ దేవాలయాలపై విధ్వంసం జరగడం ఇదే మొదటిది సారి కాదు. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. కెనడాలో మళ్లీ మళ్లీ హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. కొన్నిసార్లు దేవాలయాల గోడలపై భారత వ్యతిరేక నినాదాలు రాస్తున్నారు. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ మరణం తర్వాత ఖలిస్తాన్ మద్దతుదారులు కెనడాలో ఇటువంటి కార్యకలాపాలను పెంచారు. జూన్ 2023లో బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో నిజ్జర్ కాల్చి చంపబడ్డాడు.

గత సంవత్సరం కెనడాలో హిందూ దేవాలయాలను ధ్వంసం చేసిన అనేక కేసులు నమోదయ్యాయి. లక్ష్మీనారాయణ ఆలయాన్ని టార్గెట్ చేశారు. ఆలయ ద్వారం వెనుక గోడపై భారత్ వ్యతిరేక, ఖలిస్థాన్ అనుకూల పోస్టర్లు అతికించారు. వాటిపై ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ చిత్రాన్ని కూడా ముద్రించారు. సర్రేలోని లక్ష్మీ నారాయణ ఆలయం బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని పురాతన అతిపెద్ద హిందూ దేవాలయం.

 

మరిన్ని అంతర్జతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..