AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bangladesh: భారత్‌కు వచ్చి మతి పోగొట్టుకున్న యువతి.. నాలుగేళ్ళ తర్వాత స్వదేశానికి పయనం..

బంగ్లాదేశ్‌కు చెందిన అక్తర్‌ రహీమా అనే 35 ఏళ్ళ మహిళ 2019లో రాజస్థాన్‌లోని అజ్మీర్‌ దర్గా సందర్శనకు వచ్చింది. అనుకోని పరిస్థితుల్లో ఆమె మతిస్థిమితం కోల్పోయింది. దాంతో అటూ ఇటూ తిరుగుతూ సత్యవేడు శ్రీసిటీ పారిశ్రామిక వాడకు చేరుకుంది.

Bangladesh: భారత్‌కు వచ్చి మతి పోగొట్టుకున్న యువతి.. నాలుగేళ్ళ తర్వాత స్వదేశానికి పయనం..
Bangladesh Woman
Raju M P R
| Edited By: |

Updated on: Jul 25, 2023 | 1:54 PM

Share

దర్గా సందర్శనకు బంగ్లాదేశ్‌నుంచి ఇండియాకు వచ్చిన ఓ మహిళ పాస్‌ పోర్ట్‌తోపాటు మతి కోల్పోవడంతో చివరకు విశాఖపట్నంలోని మెంటల్‌ ఆస్పత్రికి చేరింది. అక్కడ వైద్యులు చికిత్సచేయడంతో మామూలు మనిషైన ఆమె అధికారుల సహాయంతో తిరిగి ఐదేళ్లతర్వాత తన స్వదేశానికి చేరింది. బంగ్లాదేశ్‌కు చెందిన అక్తర్‌ రహీమా అనే 35 ఏళ్ళ మహిళ 2019లో రాజస్థాన్‌లోని అజ్మీర్‌ దర్గా సందర్శనకు వచ్చింది. అనుకోని పరిస్థితుల్లో ఆమె మతిస్థిమితం కోల్పోయింది. దాంతో అటూ ఇటూ తిరుగుతూ సత్యవేడు శ్రీసిటీ పారిశ్రామిక వాడకు చేరుకుంది. మతి స్థిమితం కోల్పోయి రాష్ట్రాలు దాటుతూ చివరికి శ్రీసిటి పారిశ్రామిక వాడ లోని అప్పయ్య పాలెం గ్రామానికి చేరింది. అక్కడ దీనస్థితిలో తిరుగుతున్న ఆ మహిళను శ్రీసిటీ సెక్యూరిటీ చీఫ్‌ రమేష్‌ గుర్తించారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రహీమాను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ మానసిక వైద్యుల సలహా మేరకు విశాఖపట్నం ప్రభుత్వ మెంటల్‌ ఆస్పత్రికి తరలించారు.

అక్కడ మూడేళ్లపాటు వైద్యం అందించారు వైద్యులు. ఆమె కోలుకోవడంతో వివరాలు తెలుసుకున్నారు పోలీసులు. విషయం తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి బంగ్లాదేశ్ ఎంబసీ కార్యాలయానికి సమాచారం ఇవ్వడంతో పూర్తిస్థాయిలో విచారణ జరిపారు. హైకమిషన్‌ అధికారులతో సంప్రదింపులు జరిపి, రహీమాను బంగ్లాదేశ్‌ సరిహద్దులోని హరిదాన్పూర్‌ వద్ద ఆ దేశ అధికారులకు అప్పగించారు. ఎట్టకేలకు రహీమ ఐదేళ్ల తర్వాత తన స్వదేశానికి చేరుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..
పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..
శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పాల పొంగళ్ళు..
శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పాల పొంగళ్ళు..
బల్లి కనిపిస్తే డబ్బు వర్షమా.. లేక దురదృష్టానికి సంకేతమా..?
బల్లి కనిపిస్తే డబ్బు వర్షమా.. లేక దురదృష్టానికి సంకేతమా..?