G20 Summit: రెండో రోజు కొంతసేపు నెలకొన్న రాజకీయ అందోళన.. ముగిసిన సదస్సు
ఇండోనేషియా రాజధాని బాలి వేదికగా.. భారత ప్రధాని అధ్యక్షతన జరిగిన జీ20 సదస్సు ముగిసింది. మంగళవారం ప్రారంభమైన ఈ సదస్సులో జీ20 సభ్య దేశాల అధినేతలు..
ఇండోనేషియా రాజధాని బాలి వేదికగా.. భారత ప్రధాని అధ్యక్షతన జరిగిన జీ20 సదస్సు ముగిసింది. మంగళవారం ప్రారంభమైన ఈ సదస్సులో జీ20 సభ్య దేశాల అధినేతలు, వారి ప్రతినిధులు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సు బుధవారం ముగిసింది. సదస్సు ముగిసే ముందుగా భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం సభ్యత్వ దేశాల ప్రతినిధులను అకట్టుకుంది. అయితే బుధవారం సదస్సు ప్రారంభం కావాడానికి ముందు సభ్య దేశాధినేతలంతా కొంత రాజకీయ ఆందోళనకు గురయ్యారు. పోలాండ్, ఉక్రెయిన్ దేశాల సరిహద్దులోని ఓ గ్రామంలో క్షిపణి పేలడమే ఇందుకు గల కారణం. ఈ ఘటనలో పోలాండ్‌కు చెందిన ఇద్దరు పౌరులు మరణించారు. రష్యా -ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతోన్న యుద్ధం నేపథ్యంలో ఈ క్షిపణి పేలడం ప్రపంచ నాయకులను ఒకింత కలవరపరిచింది. పోలాండ్‌లోని పరిస్థితుల గురించి తెలుసుకోవడానికి ఆ దేశ మిలిటరీ అధికారులతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అత్యవసర మీటింగ్ నిర్వహించారు. కాగా పోలాండ్‌లో జరిగిన ఘటన కారణంగా..‘‘ ఈ పేలుళ్లను మేను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఉక్రెయిన్‌లోని నగరాల మీద, ప్రజల మీద మంగళవారం బార్బారిక్ క్షిపణులతో దాడి చేసింది. ఈ రోజు జరిగిన పేలుడు ఉక్రెయిన్ సరిహద్దుకు దగ్గరగా పోలాండ్‌లోని తూర్పు ప్రాంతంలో జరిగినట్లు తెలిసింది’’ అని నాటో, జీ7 దేశాలు ఉమ్మడి ప్రకటన చేశాయి.
పోలాండ్‌లో జరిగిన ఘటనపై తాము విచారణ జరిపిస్తామని, దీని వెనుక రష్యా ఉండకపోవచ్చని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అభిప్రాయపడ్డారు. జీ20 లోని కొన్ని దేశాలు కూడా పోలాండ్ ఘటనను ఖడించాయి. అనంతరం సదస్సును ఉద్దేశించి మాట్లాడిన భారత ప్రధాని నరేంద్ర మోదీ జీ20 సభ్యత్వ దేశాల మధ్య కీలకంగా ప్రసంగించారు. ‘‘ డిజిటల్ రంగం పురోగతి కారణంగా కలిగే ప్రయోజనాలు పరిమితం కాకూడదు. ‘డాటా ఫర్ డెవలప్మెంట్’ అనేది ‘ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్’ థీమ్‌లో అంతర్భాగంగా ఉంటుంది. భారత్ డిజిటల్ పబ్లిక్ గూడ్స్‌ను అభివృద్ధి చేసింది. ప్రజాస్వామ్య సూత్రాల నిర్మాణంలో అది అంతర్భాగంగా ఉంది’’ అని అన్నారు. బాలిలోని భారత విదేశాంగ సెక్రటరీ క్వాత్రా మాట్లాడుతూ..‘‘ ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘ఇది యుద్ధాల యుగం కాదు’ అని ఇచ్చిన సందేశం సదస్సులోని దేశాధినేతలు, ప్రతినిధుల గుండెల్లో ప్రతిధ్వనించింది. అంతేకాక వేర్వేరు పక్షాల మధ్య అంతరాలు తగ్గడానికి అది దోహదపడింది’’ అని అన్నారు.
సదస్సు సందర్భంగా దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చల కోసం ఇండోనేషియా, స్పెయిన్, ఫ్రాన్స్, సింగపూర్, జర్మనీ, ఇటలీ, ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాలకు చెందిన నేతలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. ఇది నిజానికి ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల సమ్మేళనం. ఈ కార్యక్రమంలో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్, బ్రిటీష్ ప్రధాని రిషి సునక్ వంటి ప్రపంచ అగ్రనేతలతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారు.
మరిన్ని ప్రపంచ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి