ఆఫ్రికాలోని కాంగోలో ఉగ్రవాదులు మరో దారుణానికి పాల్పడ్డారు. పశ్చిమ కాంగోలిన బెని ప్రావిన్స్ లో స్థానికులపై కాల్పలు జరిపారు. ఈ ఘటనలో దాదాపు 20 మంది సాధారణ పౌరులు మృతిచెందారు. అయితే ఈ దాడి చేసింది తామేనని స్వయంగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహిస్తూ ప్రకటనను జారీ చేసింది. బెనీలోని ముసందబాలో 20 మృతదేహాలు గుర్తించామని తెలిపింది. మరోవైపు ఉగాండాకు చెందిన అల్లైడ్ డెమొక్రటిక్ ఫోరెక్స్ గ్రూప్ పౌరులపై దాడులు చేసినట్లు ఆర్మీ, స్థానిక అధికారులు ఆరోపించారు.
అలాగే మార్చి 20న కూడా తూర్పు ఇటూరి, ఉత్తర కివు ప్రవాన్సుల్లో కూడా ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రెండు వేరువేరు దాడుల్లో 22 మందిని హతమార్చడమే కాకుండా ముగ్గురు వ్యక్తుల్ని ఎత్తుకెళ్లారు. ఇటూరి ప్రవిన్స్ లో కూడా పలు గ్రామాలపై దాడులు చేశారు. ఇందులో దాదాపు 12 మందిని ఊచకోత కోశారు. అదే విధంగా కివు ప్రావిన్సులో 10 మంది ప్రాణాలు తీశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..