ATA: ఆటా మహాసభల కోసం ఫండ్‌రైజింగ్‌‌ ఈవెంట్‌కు అనూహ్య స్పందన..

| Edited By: Team Veegam

Sep 27, 2021 | 6:52 PM

ATA News: 17వ ఆటా మహాసభలను ఎంతో అట్టహాసంగా నిర్వహించాలని సిద్దమవుతోంది అమెరికా తెలుగు సంఘం - ఆటా.. 2020 జూలై 1,2,3 తేదీల్లో వాషింగ్టన్ డీసీలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి.

ATA: ఆటా మహాసభల కోసం ఫండ్‌రైజింగ్‌‌ ఈవెంట్‌కు అనూహ్య స్పందన..
ATA
Follow us on

ప్రవాసంలోని ప్రముఖ తెలుగు సంఘాల్లో అతి ముఖ్యమైనది అమెరికా తెలుగు సంఘం-ఆటా. 17వ ఆటా మహాసభలను ఎంతో అట్టహాసంగా నిర్వహించేందుకు ఆటా సిద్దమవుతోంది . 2020 జూలై 1,2,3 తేదీల్లో వాషింగ్టన్ డీసీలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. మహాసభల నిర్వహణ అంటే చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. చేయి చేయి కలిపితేనే విజయవంతం అవుతుంది. నిధుల సేకరణలో భాగంగా వాషింగ్టన్‌ డీసీ ఆటా మహాసభల కోసం తలపెట్టిన ఫండ్‌రైజింగ్‌కు అనూహ్య స్పందన వస్తోంది. ఊహించినదానికన్నా మరింత గొప్పగా సదస్సును విజయవంతం చేస్తామని ఆటా ప్రతినిధులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మహాసభలను విజయవంతం చేసేందుకు అవసరమైన ఆర్థిక వనరులను ఆటా సిద్దం చేసుకుంటోంది. ఇందులో భాగంగా డెట్రాయిట్‌ నగరంలో ఫండ్‌ రైజింగ్‌ ఈవెంట్‌ నిర్వహించింది.. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న ఆటా సభ్యులతో పాటు స్థానిక తెలుగువారు ఉత్సహంగా విరాళాలను ఇచ్చారు. ఫండ్‌రైజింగ్‌ విజయవంతం కావడంపై ఆటా అధ్యక్షుడు భువనేశ్‌ భుజాలా ఆనందం వ్యక్తం చేశారు.  డెట్రాయిన్‌లో గతంలో ఎన్నడూ లేనంతగా సహకారం అందిందని ఆటా కార్యదర్శి హరిప్రసాద్‌ రెడ్డి లింగాల చెప్పారు.  ఊహించిన దానికన్నా గొప్పగా మహా సభలను విజయవంతంగా నిర్వహిస్తామని ధీమా కలిగిందంటున్నారు..

అటు వాషింగ్టన్‌ డీసీ మహా సభలను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాటు ప్రారంభమయ్యాయని ఆటా కాన్ఫరెన్స్‌ కన్వీనర్‌ సుధీర్‌ భండారు, కాన్ఫరెన్స్‌ డైరెక్టర్‌ కేకే రెడ్డి తెలిపారు. తెలుగువారంతా సమావేశాలకు వచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ ఫండ్‌రైజింగ్‌ ఈవెంట్‌లో ఆటా నాయకులు, సభ్యులతో పాటు స్థానిక తెలుగువారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్శనగా నిలిచాయి.

ఆటా మరిన్ని సేవా కార్యక్రమాలు..

అటు కరోనా సంక్షోభం తర్వాత మరిన్ని సేవా కార్యక్రమాలతో అమెరికా తెలుగు సంఘం-ఆటా ముందుకు వస్తోంది. ఆటాను మరింత బలోపేతం చేయడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కార్యక్రమాలను కూడా విస్తరించడంపై దృష్టి పెట్టారు. ఈ దిశగా బోర్డు మీటింగ్‌లో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. తెలుగు సంస్కృతి సంప్రయాదాల పరిరక్షణతో పాటు అనేక సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్న ఆటా వచ్చే ఏడాది 17 మహాసభల కోసం సన్నాహాలు ప్రారంభించింది.. ఇందులో భాగంగా డెట్రాయిట్‌లో ఆటా బోర్డు మీటింగ్‌ నిర్వహించారు.. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో తిరిగి కార్యక్రమాలను విస్తరించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.. ఆటా బోర్డుతో పాటు కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు..

అమెరికా తెలుగు సంఘం కార్యక్రమాలను మరింతగా విస్తరిస్తామని ఆటా అధ్యక్షుడు భువనేశ్‌ భుజాలా తెలిపారు. సంస్థాగతంగా మరింత బలోపేతం కావడంతో పాటు కొత్తగా చేపట్టాల్సిన కార్యక్రమాలను చర్చించినట్లు వెల్లడించారు. 2022 జులై 1,2,3 తేదీల్లో వాషింగ్టన్‌ డీసీలో చపట్టిన 17వ మహాసభలను విజయవంతం చేయడంపై దృష్టి పెట్టామన్నారు. ఆటా ఆధ్వర్యంలో డిసెంబర్‌ నెలలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు ఆటా ఎలెక్ట్‌ ప్రెసిడెంట్‌ మధు బొమ్మినేని.

Also Read..

కొన్ని వేలకోట్ల విలువజేసే 2వేల ఏళ్లనాటి నిధిపై తాలిబన్ల కన్ను… అంత డబ్బువారి చేతులో పడితే..

ఏపీ మహిళా ఎమ్మెల్యేకు తెలంగాణలో ఇంత క్రేజా.! కరీంనగర్‌ వ్యక్తి తన అభిమానాన్ని ఎలా చాటుకున్నాడో చూడండి..