Afghan Crisis: కొన్ని వేలకోట్ల విలువజేసే 2వేల ఏళ్లనాటి నిధిపై తాలిబన్ల కన్ను… అంత డబ్బువారి చేతులో పడితే..
Afghan Crisis: తాలిబాన్ సమాచార మరియు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ బాక్ట్రియన్ గోల్డ్ నిధిని గుర్తించడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్లు చెప్పింది. ఈనిధి నాలుగు దశాబ్దాల క్రితం ఉత్తర అఫ్గాన్‌లో జ్వాజియన్ ప్రావిన్స్‌లో..
Afghan Crisis-Bactrian Gold Treasure: తాలిబాన్ సమాచార మరియు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ బ్యాక్ట్రియన్ గోల్డ్ నిధిని గుర్తించడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్లు చెప్పింది. ఈనిధి నాలుగు దశాబ్దాల క్రితం ఉత్తర అఫ్గాన్‌లో జ్వాజియన్ ప్రావిన్స్‌లో షేర్‌బర్ఘన్ జిల్లాలోని తిల్యా తెపే ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. ఈ నిధి విషయంపై తాలిబాన్ తాత్కాలిక క్యాబినెట్ సాంస్కృతిక కమిషన్ డిప్యూటీ హెడ్ అహ్మదుల్లా వాసిక్ మాట్లాడుతూ.. బాక్టీరియన్ ఇప్పుడు ఎక్కడ ఉందో కనుగొని తనిఖీ చేసే బాధ్యతను సంబంధిత శాఖలకు అప్పగించినట్లు చెప్పారు.
అయితే ఈ నిధి ఆఫ్ఘనిస్తాన్ ను సోవియట్ యూనియన్ ఆక్రమించడానికి కొన్ని సంవత్సరాల క్రితం గ్రీక్-రష్యన్ పురావస్తు శాస్త్రవేత్త విక్టోర్ సరియాందీ నేతృత్వంలో సోవియట్-అఫ్గాన్ పురావస్తు పరిశోధన బృందం కనుగొంది. ఉత్తర అఫ్గాన్‌లో జ్వాజియన్ ప్రావిన్స్‌లోని తిల్యా తెపే అనే ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో భారీ ఖజానా వెలుగులోకి వచ్చింది. ఈ ఖజానాలో 20,600 పురాతన వస్తువులు లభించాయి. బంగారు ఆభరణాలు, బంగారు నాణేలు, బొమ్మలు, పలు రకాల వస్తువులు సహా భారత్ లోని ఏనుగు దంపతలతో చేసిన కళాకండాలు కూడా ఈ నిధిలో ఉన్నాయి. ఇవన్నీ క్రీస్తుపూర్వం 1వ శతాబ్ధకాలానికి చెందినవిగా అప్పటి పురావస్తు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ముఖ్యంగా ఆరవ సమాధిలో కనిపించే బంగారు కిరీటం అద్భుతమని నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ 2016 లో ఓ కథనంలో పేర్కొంది.
ఈ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన నిధి ఆ ప్రాంతం పురావస్తు సంపదకు గని వంటిదని విక్టోర్ బ్యాక్ట్రియన్ అభిప్రాయపడ్డారు. ఇక 4వ శతాబ్దంలో అలెగ్జాండర్ ది గ్రేట్ బ్యాక్ట్రియన్‌ను ఆక్రమించాడు. అనంతరం ఈ ప్రాంతం పలు దండయాత్రలకు గురైంది. ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొంది. దీంతో పలు సంస్కృతులకు సంబంధించిన ఆనవాళ్లు అక్కడ నిక్షిప్తమైపోయాయి.
అయితే మిగిలిన వస్తువులు పేద దేశానికి పెద్ద ఆదాయ వనరుగా మారింది. పలు దేశాల్లో నిధిలోని వస్తువులను ప్రదర్శనకు ఉంచి డబ్బులు అందుకుంది. దీనిని 2006 నుంచి 13 సార్లు విదేశాల్లో ప్రదర్శనలకు పెట్టింది. పారిస్‌లో తొలిసారి ప్రదర్శించారు. చివరిసారిగా 2020లో హాంకాంగ్‌లో ప్రదర్శనకు ఉంచారు. ఈ ప్రదర్శనల ద్వారా అఫ్గాన్ ప్రభుత్వానికి 4.5 మిలియన్ డాలర్ల ఆదాయం లభించింది.
అయితే అప్పటి దేశ దిగువ సభ సభ్యుడు మిర్ రహ్మన్ రెహ్మానీ ఈ ఏడాది జనవరిలో పార్లమెంట్‌లో అఫ్గానిస్థాన్‌లోని అవినీతి బ్యాక్ట్రియన్ సంపదకు ప్రమాదంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయన ఈ నిధిని తగిన విధంగా భద్రపరచాలి ప్రతిపాదన చేసహ్రు. అయితే ఈ ప్రతిపాదన ముందుకుసాగలేదు.. ఇక ఇప్పుడు ఈ బంగారు నిధి తాలిబన్లు హస్తగతం చేసుకున్న ప్రాంతంలో ఉండిపోయింది. ఈ వారసత్వ సంపాదన తాలిబన్ల కంట పడితే.. ప్రమాదమని పురావస్తు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఆర్ధిక పరిస్థితులు అగమ్యగోచరంగా మారింది. అఫ్గాన్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. దీంతో వివిధ దేశాల్లో ఉన్న అఫ్గాన్ రిజర్వులు, బంగారాన్ని ఆయా దేశాలు స్తంభింపజేశాయి. దీంతో తాలిబన్లు డబ్బులు లేక కటకటలాడుతున్నారు. విదేశీయులు నిధుల కోసం తాము మారిపోయామని.. మంచి పాలన అందిస్తామని హామీల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఆఫ్గనిస్తాన్ లో ఉన్న పరిస్థితుల్లో అత్యంత పురాతన స్వర్ణ నిధి ‘బ్యాక్ట్రియన్ ట్రెజరీ’గురించి పురావస్తు నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
Also Read: ఏపీ సర్కార్ సహా.. దిశ పోలీస్ స్టేషన్ల పని తీరు అద్భుతం అంటూ పార్లమెంట్ కమిటీ ప్రశంసలు..