Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: నేడే ఐపీఎల్‌ స్టార్ట్‌.. డీలా పడ్డ డిఫెండింగ్‌ ఛాంపియన్‌! KKR బలం పోయిందా?

KKR ఐపీఎల్ 2025లో తమ బలాలను, బలహీనతలను, ఊహించిన ప్లేయింగ్ ఎలెవెన్‌ను విశ్లేషించడం జరిగింది. రింకూ సింగ్, రస్సెల్, నరైన్ వంటి ఆటగాళ్ళు బలంగా ఉన్నప్పటికీ, కెప్టెన్సీ మార్పు మరియు గంభీర్ లేకపోవడం వంటివి బలహీనతలుగా గుర్తించబడ్డాయి. బ్యాటింగ్, బౌలింగ్ లైన్ అప్‌లను వివరంగా పరిశీలించి, ఈ సీజన్‌లో KKR విజయం సాధించే అవకాశాలను అంచనా వేయడం జరిగింది.

IPL 2025: నేడే ఐపీఎల్‌ స్టార్ట్‌.. డీలా పడ్డ డిఫెండింగ్‌ ఛాంపియన్‌! KKR బలం పోయిందా?
Kkr Vs Rcb
Follow us
SN Pasha

|

Updated on: Mar 22, 2025 | 6:50 AM

ఐపీఎల్‌ 2025 నేటితో(శనివారం, మార్చ్‌ 22) మొదలుకానుంది. తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పోటీ పడనుంది. ఈ మ్యాచ్‌ కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో జరగనుంది. ఈ మెగా సమరం కోసం క్రికెట్‌ ఫ్యాన్స్‌ అంతా ఎదురుచూస్తున్నారు. మరి ఈ మ్యాచ్‌కి ముందు కేకేఆర్‌ బలం ఎలా ఉందో చూద్దాం.. ఐపీఎల్‌ 2024 సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచింది కోల్‌కతా నైట్‌ రైడర్స్‌. అంతకంటే ముందు 2012, 2014లో గౌతమ్‌ గంభీర్‌ కెప్టెన్సీలో ఆ జట్టు రెండు ఐపీఎల్‌ ట్రోఫీలను సాధించింది. ఆ తర్వాత మళ్లీ పదేళ్ల తర్వాత గౌతమ్‌ గంభీర్‌ మెంటర్‌గా వచ్చిన తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్సీలో లాస్ట్‌ సీజన్‌లో కప్పు కొట్టింది. కానీ, మెగా వేలం తర్వాత ఆ జట్టు అంత సూపర్‌ స్ట్రాంగ్‌గా కనిపించడం లేదనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

మరి డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కేకేఆర్‌ ఈ సీజన్‌లో ఎలాంటి ప్లేయింగ్‌ ఎలెవన్‌తో బరిలోకి దిగనుంది? వారి బలం ఏంటి? ఏ ఏరియాలో వీక్‌గా ఉన్నారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్‌ విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. ఐపీఎల్‌ 2025 మెగా వేలానికి ముందు కేకేఆర్‌ ఆరుకు ఆరు రిటెన్షన్స్‌ చేసుకుంది. రింకూ సింగ్‌, రస్సెల్‌, సునీల్‌ నరైన్‌, వరుణ్‌ చక్రవర్తి, హర్షిత్‌ రాణా, రమణ్‌ దీప్‌ సింగ్‌లను వాళ్లు రిటేన్‌ చేసుకున్నారు. చాలా కాలంగా కేకేఆర్‌ జట్టు కరేబియన్‌ వీరులు ఆండ్రీ రస్సెల్‌, సునీల్‌ నరైన్‌పై ఎక్కువగా ఆధారపడుతోంది. అందుకు తగ్గట్లే వాళ్లిద్దరూ కూడా కేకేఆర్‌ కోసం అద్బుతంగా ఆడుతూ వస్తున్నారు. ఇప్పుడు ఈ సీజన్‌లో కూడా కేకేఆర్‌ వారిపై ఆశలు పెట్టుకొని ముందు వెళ్తోంది. ఒకసారి కేకేఆర్‌ బ్యాటింగ్‌ లైనప్‌ చూస్తే.. క్వింటన్‌ డికాక్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, అజింక్యా రహానె, రహమనుల్లా గుర్బాజ్‌, రొమన్‌ పొవెల్‌, మనీష్‌ పాండే, రింకూ సింగ్‌, రఘువంశీ, రస్సెల్‌, రమన్‌ దీప్‌ సింగ్‌తో కూడిన మంచి బ్యాటింగ్‌ లైనప్‌ ఉంది.

కానీ, వీరిలో అందరూ ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఉండకపోవచ్చు. బట్‌ వీరిలో ఎవర్ని పిక్‌ చేసుకున్నా.. అది మంచి బ్యాటింగ్‌ లైనప్‌ అవుతుంది. ఇక ఆల్‌రౌండర్లుగా వెంకటేశ్‌ అయ్యర్‌, రమన్‌ దీప్‌ సింగ్‌, రస్సెల్‌ ఉన్నారు. వీరు ముగ్గురు కూడా కచ్చితంగా ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఉండే ఛాన్స్‌ ఉంది. మెయిన్‌ అలీ కూడా ఉన్నప్పటికీ.. ఫారెన్‌ ప్లేయర్ల ఈక్వేషన్‌ దాటి అతనికి ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చోటు దక్కుతుందా లేదా అనేది చూడాలి. బౌలింగ్‌లో కూడా కేకేఆర్‌ స్ట్రాంగ్‌గానే కనిపిస్తోంది. అందుకు ప్రధాన కారణం వాళ్ల టీమ్‌లో ఇద్దరు మిస్టరీ స్పిన్నర్లు ఉన్నారు. వరుణ్‌ చక్రవర్తి, సునీల్‌ నరైన్‌. ఇప్పటికే దశాబ్దకాలం పైగా ఆడుతున్నా.. సునీల్‌ నరైన్‌ ఇప్పటికీ బ్యాటర్లకు ఒక కొరకరాని కొయ్య. అతన్ని బౌలింగ్‌ రీడ్‌ చేయడం అంత ఈజీ కాదు. ఇక వరుణ్‌ ఇటీవలె ఛాంపియన్స్‌ ట్రోఫీలో తన మిస్టరీ పవరేంటో చూపించాడు. సో అతను కూడా డబుల్‌ ఎనర్జీతో బరిలోకి దిగే అవకాశం ఉంది. వీరిద్దరి 8 ఓవర్ల బౌలింగ్‌ కోటాను కేకేఆర్‌ ఎంత భద్రంగా వాడుకుంటే విన్నింగ్‌ ఛాన్సెస్‌ అంత పెరుగుతాయి.

ఇక పేస్‌ బౌలింగ్‌ హర్షిత్‌ రాణా, సౌతాఫ్రికా బౌలర్‌ అన్రిచ్‌ నోర్జే ప్రధాన ఆయుధాలుగా ఉంటారు. ఉమ్రాన్‌ మాలిక్‌ను వేలంలో తీసుకున్నా.. అతను గాయంతో ఈ సీజన్‌కు దూరం అయ్యాడు. అతని ప్లేస్‌లో చేతన్‌ సకారియాను తీసుకున్నారు. వీళ్లు కాకుండా వైభవ్‌ ఆరోరా, మయాంక్‌ మార్కండే, స్పాన్సర్‌ జాన్సన్‌ ఉన్నారు. సో.. కేకేఆర్‌ బ్యాటింగ్‌ బౌలింగ్‌లో సూపర్‌ బ్యాలెన్సెడ్‌గా కనిపిస్తోంది. వీరి ప్రధాన బలం ఆల్‌రౌండర్లు అని చెప్పవచ్చు. సునీల్‌ నరైన్‌ను ఓపెనర్‌గా ఆడించాలనే గంభీర్‌ స్ట్రాటజీని మరోసారి కేకేఆర్‌ ఫాలో అయితే వారి బ్యాటింగ్‌ డెప్త్‌ మరింత పెరిగే ఛాన్స్‌ ఉంది. మొత్తంగా కేకేఆర్‌ అద్భుతంగా కనిపిస్తున్నా.. ఆ టీమ్‌ లోపాల గురించి మాట్లాడుకుంటే కొన్ని కనిపిస్తున్నాయి.

అందులో ముఖ్యంగా కెప్టెన్సీ మార్పు. గత సీజన్‌లో ఆ జట్టును ఛాంపియన్‌గా నిలిపిన శ్రేయస్ అయ్యర్‌ కేకేఆర్‌ నుంచి బయటికి వెళ్లిపోయాడు. దాంతో వాళ్లు వెటరన్‌ ప్లేయర్‌ అజింక్యా రహానెను కెప్టెన్‌గా పెట్టుకున్నారు. రహానె డొమెస్టిక్‌ క్రికెట్‌లో మంచి కెప్టెన్సీ చేసినా.. టీ20 ఫార్మాట్‌కు అతని కెప్టెన్సీ స్కిల్స్‌ సరిపోతాయా డౌట్‌ ఉంది. పైగా రహానె నుంచి పరుగులు రాకపోతే.. అది జట్టుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. రహానెను కెప్టెన్‌ చేసి కేకేఆర్‌ రిస్క్‌ చేసిందని చెప్పవచ్చు. రహానె బదులు వెంకటేశ్‌ అయ్యర్ లాంటి యంగ్‌ ప్లేయర్‌కు కెప్టెన్సీ ఇచ్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ఇక మెంటర్‌గా గంభీర్‌ లేకపోవడం కూడా కేకేఆర్‌కు మైనస్‌గా మారే అవకాశం ఉంది. టీమ్‌ ఎంత బాగున్న వారి బలాన్ని సరిగ్గా గుర్తించి సరైన దారిలో నడిపించే వాళ్లు ఉండాలి. కానీ, కేకేఆర్‌ మెంటర్‌ గంభీర్‌, కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ను ఒకేసారి కోల్పోయింది. వీళ్లంతా కాదు హెడ్‌ కోచ్ చంద్రకాంత్‌ ఉన్నాడు ఆయన చూసుకుంటాడు అని ఫ్యాన్స్‌ అనుకోవచ్చు. అది నిజమే అయితే మ్యాచ్‌లు జరిగే వరకు ఆగాల్సిందే. ఇక చివరిగా కేకేఆర్‌ బెస్ట్‌ ప్లేయింగ్‌ గురించి మాట్లాడుకుంటే.. సునీల్ నరైన్, క్వింటన్ డి కాక్, అజింక్యా రహానే , అంగ్క్రిష్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రామన్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్ ఉండే అవకాశం ఉంది. అవసరాన్ని బట్టి వైభవ్ అరోరాను ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌గా ఆడించే ఛాన్స్‌ ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.