AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Donald Trump: వెనిజులాను పాలించేది మేమే.. మదురో నిర్భందం తర్వాత ట్రంప్ సంచలన ప్రకటన!

దక్షిణ అమెరికా దేశమైనా వెనిజులాపై శనివారం అమెరికా దాడి చేసిన విషయం అందిరికీ తెలిసిందే.. ఈ దాడి తర్వాత ఇటీవలే వెనిజులా అద్యక్షుడైన నికొలస్‌ మదురోను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకుంది. అతన్ని న్యూయార్క్‌ నగరంలోని డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేంద్రానికి తరలించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Donald Trump: వెనిజులాను పాలించేది మేమే.. మదురో నిర్భందం తర్వాత ట్రంప్ సంచలన ప్రకటన!
Us Venezuela Conflict
Anand T
|

Updated on: Jan 04, 2026 | 11:23 AM

Share

గతకొన్ని రోజులుగా వెనిజులాపై కన్నేసిన అమెరికా శనివారం తెల్లవారుజామున ఆదేశ రాజధాని కారకాస్‌పై దాడికి పాల్పడింది. ప్యూర్టో రీకోలోని అమెరికన్‌ బేస్‌ నుంచి వెనెజులాలోకి దూసుకొచ్చిన ఫైటర్‌ జెట్‌లు ఆదేశ ఆర్మీ బేస్‌లపై దాడికి దిగాయి. FBI సహకారంతో జరిగిన ఈ ఆపరేషన్‌ 30 నిమిషాల్లోనే ముగిసింది. ఈ దాడి అనంతరం వెనెజులా అధ్యక్ష భవనంలోకి వెళ్లిన యూఎస్‌ ఆర్మీ తన బెడ్రూమ్‌లో నిద్రిస్తున్న మదురోను బలవంతంగా బయటకు లాక్కొచ్చారు. ఆ తర్వాత ఆయన్ను న్యూయార్క్‌లోని డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేంద్రానికి తరలించారు.

టంప్ ప్రకటనలో నిజమెంత?

అయితే ఆ దాడుల తర్వాత ఆమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ ఈ మొత్తం ఆపరేషన్లో ఒక్కరు కూడా చనిపోలేదని.. ఇద్దరికి మాత్రమే గాయాలైనా.. వారు సురక్షితంగానే ఉన్నారన్నారని తెలిపారు. తాము అర్మీ బేస్‌లు, వివిధ లొకేషన్లపై దాడులు చేశామని.. కాని ఎవరూ చనిపోలేదన్నారు. కానీ వెనిజులాకు చెందిన ఒక సీనియర్ అధికారి మాత్రం వెనిజులాలో అమెరికా నిర్వహించిన భారీ సైనిక చర్యలో కారణంగా పౌరులు, సైనికులు సహా కనీసం 40 మంది మరణించారని పేర్కొన్నారు.

వెనుజులాను పాలించేది మేమే: ట్రంప్

ఇదిలా ఉండగా ఇకపై వెనిజులా పాలనపై ట్రంప్ కీలక ప్రకనన చేశారు. సురక్షితంగా అధికారాల బదిలీ జరిగేదాకా వెనుజులాను తామే పాలిస్తామంటూ ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు. గత కొంతకాలం వెనిజులా తమ ఆధీనంలోనే నడుస్తుందన్నారు. ప్రజల జీవనానికి సురక్షితమని భావించే వరకూ దేశంలో సరైన, న్యాయమైన అధికారాల బదిలీ అయ్యే వరకూ వెనుజులా పాలన తమ ఆదీనంలోనే ఉంటుందన్నారు శనివారం నిర్వహించిన ఒక మీడియా సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు.

అసలు ఏం జరిగింది?

మదురోపై కొన్ని నెలలుగా అమెరికా ఒత్తిడి చేస్తూ వచ్చింది. అయితే ఆయన ఆమెరికా ఒత్తిళ్లకు లొంగలేదు. తాను తలవంచబోనని ప్రకటించారు. మరోవైపు వెనెజులాపై దాడికి అమెరికా కొన్ని రోజులుగా ప్రణాళికలు రచించింది. ఆయన ప్రతీరోజు ఏం చేస్తారు? లేచిన దగ్గర్నుంచి పడుకునే వరకు డైలీ రొటీన్‌ ఏంటి? ఏం తింటారు? ఎక్కడ పడుకుంటారనేది క్షుణ్ణంగా పరిశీలించి.. సరైన సమయాన్ని చూసి దెబ్బకొట్టింది అమెరికా స్పెషల్‌ ఫోర్సెస్‌.

డ్రగ్స్‌ ట్రాఫికింగ్‌కు చెక్‌

మదురో అరెస్టుతో డ్రగ్‌ ట్రాఫికింగ్‌ ఇక ఆగిపోతుందని అమెరికా చెబుతోంది. తమకు దక్కాల్సిన ఆయిల్‌ తిరిగి వస్తుందని జేడీ వాన్స్‌ ప్రకటించారు. ఇక మదురోపై అమెరికాలో బలమైన అభియోగాలు నమోదు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఆయనను సోమవారం న్యూయార్క్‌ ఫెడరల్‌ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అప్పటివరకు బ్రూక్లిన్‌లోని మెట్రోపాలిటన్‌ డిటెన్షన్ సెంటర్లోనే మదురో ఉంటారు. నార్కో టెర్రరిజం, కొకైన్‌ దిగుమతి కుట్ర, అక్రమంగా విధ్వంసకర ఆయుధాలను కలిగిఉండడం, విధ్వంసక ఆయుధాలను స్మగ్లింగ్‌ చేసే కుట్రపన్నారంటూ అనేక అభియోగాలు వెనెజులా అధ్యక్షుడు మదురోపై నమోదు చేసింది అమెరికా.

మదురో నిర్భందంతో సంబరాలు

మరోవైపు నికోలస్‌ మదురో నిర్బంధంతో వెనెజులాలో సంబరాలు జరుగుతున్నాయి. మదురో పీడ విరగడ అయిందంటూ వీధుల్లోకి వచ్చి నినాదాలు చేస్తున్నారు. ఇక మదురో నిర్బంధాన్ని ఖండించారు వెనెజులా వైస్‌ ప్రెసిడెంట్‌ డెల్సీ రోడ్రీగ్స్‌. తనను తాను తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రకటించుకున్నారు. అంతేకాదు మదురోను విడిచిపెట్టాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.