Halloween Stampede: హాలోవీన్ వేడుకల్లో మరణ మృదంగం.. 149 మందికి పైగా మృతి.. 150 మందికి గాయాలు..

|

Oct 30, 2022 | 6:47 AM

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఏటా జరిగే హాలోవీన్ వేడుకల్లో తొక్కిసలాట జరిగి భారీగా ప్రాణ నష్టం జరిగింది. ఏకంగా 149 మంది మరణించగా.. 150 మందికి పైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది.

Halloween Stampede: హాలోవీన్ వేడుకల్లో మరణ మృదంగం.. 149 మందికి పైగా మృతి.. 150 మందికి గాయాలు..
Halloween Stampede
Follow us on

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఏటా జరిగే హాలోవీన్ వేడుకల్లో తొక్కిసలాట జరిగి భారీగా ప్రాణ నష్టం జరిగింది. ఏకంగా 149 మంది మరణించగా.. 150 మందికి పైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. హాలోవీన్ వేడుకల్లో భాగంగా సియోల్‌లో శనివారం రాత్రి పెద్దఎత్తున ప్రజలు ఒక ఇరుకైన వీధి నుంచి వెళ్తుండగా.. అకస్మాత్తుగా తొక్కిసలాట జరిగినట్లు దక్షిణ కొరియా అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. తొక్కిసలాట తరువాత.. ఎక్కువమంది గుండెపోటుకు గురయ్యారని.. కొందరు ఊపిరాడక చనిపోయినట్లు తెలిపారు. దేశంలోని దాదాపు 400 మంది అత్యవసర సిబ్బందిని, 140 వాహనాలను రంగంలో దించి సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. లీసుర్ జిల్లాలోని ఇటావోన్‌లో జరిగిన తొక్కిసలాట తరువాత సియోల్‌లోని ఆసుపత్రులకు.. గాయపడ్డవారిని తరలించినట్లు ప్రకటించారు. అయితే, మరణాల సంఖ్య పెరగే అవకాశముందని సియోల్ యోంగ్సన్ అగ్నిమాపక విభాగం చీఫ్ చోయ్ సియోంగ్-బీమ్ తెలిపారు. మృతుల్లో 13 మందిని ఆసుపత్రులకు తరలించామని, మిగిలిన చాలామంది మృతదేహాలు వీధుల్లోనే ఉన్నాయని చెప్పారు. అవి కూడా తరలిస్తున్నామని.. ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ విధించినట్లు అధికారులు వెల్లడించారు.

కాగా.. తొక్కిసలాట అనంతరం.. సియోల్‌లో భయంకర పరిస్థితులునెలకొన్నాయి. ఊపిరాడని పరిస్థితుల్లో రోడ్లపై పడి ఉన్న చాలామందిని.. అక్కడికక్కడే గుండె (సీపీఆర్‌) చికిత్సలు అందిస్తూ సిబ్బంది కనిపించారు. గాయపడ్డవారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

Seoul

హాలోవీన్ ఉత్సవాలు జరిగే ప్రాంతం ఇటావాన్ లోని ఓ బార్‌కు గుర్తుతెలియని ఒక సెలబ్రిటీ వచ్చారన్న సమాచారంతో ప్రజలు అక్కడకు వెళ్లేందుకు ఒకేసారి పరుగులు తీసారని.. ఇది తొక్కిసలాటకు కారణమైందని స్థానిక మీడియా పేర్కొంది. దక్షిణ కొరియాలో కరోనావైరస్‌ ఆంక్షల్ని సడలించడంతో ఈ హాలోవీన్‌ వేడుకలకు దాదాపు లక్షమంది వరకు హాజరయ్యారని మీడియా వెల్లడించింది.

ఈ ఘటనపై దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. గాయపడిన వారికి త్వరితగతిన చికిత్స అందించాలని, పండుగ ప్రదేశాల్లో భద్రతను సమీక్షించాలని అధికారులకు సూచించారు. చికిత్స కోసం అన్నీ ఏర్పాట్లు చేయాలని ఆయన ఆరోగ్య మంత్రిత్వ శాఖను ఆదేశించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..