Dubai Princess Divorce: ‘డియర్‌ హస్బెండ్‌.. నీకు విడాకులు ఇస్తున్నా’.. ఇన్‌స్టాలో విడాకులిచ్చిన దుబాయ్‌ యువరాణి

|

Jul 18, 2024 | 12:24 PM

దుబాయ్‌ యువరాణి షైకా మహ్రా మొహమ్మద్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ సంచలన ప్రకటన చేశారు. తన భర్త షేక్‌ మనా బిన్‌ మొహమ్మద్‌ అల్‌ మక్తూమ్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు ఇన్‌స్టా వేదికగా తెలిపారు. సోషల్ మీడియాలోనే ఆమె ట్రిపుల్ తలాక్‌ చెప్పి భర్తకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ దంపతులకు తొలి సంతానం కలిగిన రెండు నెలలకే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. భర్త ఇలా సామాజిక మాధ్యమం వేదికగా తలాక్‌ చెప్పడం..

Dubai Princess Divorce: ‘డియర్‌ హస్బెండ్‌.. నీకు విడాకులు ఇస్తున్నా’.. ఇన్‌స్టాలో విడాకులిచ్చిన దుబాయ్‌ యువరాణి
Dubai Princess Divorce
Follow us on

అరబ్‌ ఎమిరేట్స్‌, జులై 18: దుబాయ్‌ యువరాణి షైకా మహ్రా మొహమ్మద్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ సంచలన ప్రకటన చేశారు. తన భర్త షేక్‌ మనా బిన్‌ మొహమ్మద్‌ అల్‌ మక్తూమ్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు ఇన్‌స్టా వేదికగా తెలిపారు. సోషల్ మీడియాలోనే ఆమె ట్రిపుల్ తలాక్‌ చెప్పి భర్తకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ దంపతులకు తొలి సంతానం కలిగిన రెండు నెలలకే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. భర్త ఇలా సామాజిక మాధ్యమం వేదికగా తలాక్‌ చెప్పడం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

డియర్‌ హస్బెండ్‌.. మీరు ఇతరుల సహచర్యం కోరుకున్నందున మీతో విడాకులు తీసుకోవాలని నిశ్చయించుకున్నా. ‘ఐ డైవర్స్‌ యూ.. ఐ డైవర్స్‌ యూ అండ్‌ ఐ డైవర్స్‌ యూ’. టేక్‌ కేర్‌.. మీ మాజీ భార్య’ అని షైకా మహ్రా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పేర్కొన్నారు. ఇస్లామిక్‌ చట్టం ప్రకారం దీనిని ‘తలాక్-ఎ-బిద్దత్’ అని పిలుస్తారు. దీని ద్వారా భర్త నుంచి విడాకులు తీసుకోవడానికి ఒకే సిట్టింగ్‌లో మూడు సార్లు తలాక్‌ చెబితే సరిపోతుంది. అంతటితో వీరి వివాహ బంధం ముగిసిపోతుంది. సాధారణంగా వీరి మతాచారం ప్రకారం పురుషులు మాత్రమే తలాక్‌ చెబుతుంటారు. కానీ మహిళలు మాత్రం ‘ఖులా’ అనే ప్రక్రియ ద్వారా విడాకులు కోరేందుకు అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మహిళలకు కూడా తలాక్‌ ఉచ్ఛరించే నిబంధనలు ఇస్లాం మతాచారాల్లో ఉన్నాయి. ఇకపోతే యువరాణి భర్తకు తలాక్‌ చెప్పిన తర్వాత దంపతులిద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, వారు కలిసి దిగిన ఫొటోలను డిలీట్‌ చేయడం ప్రస్తుతం చర్చణీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

కాగా 2023 మేలో ప్రముఖ పారిశ్రామికవేత్త షేక్‌ మనా బిన్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ బిన్‌ మనా అల్‌ మక్తూమ్‌ను యువరాణి షైఖా మహారా వివాహం చేసుకున్నారు. ఏడాది తర్వాత ఈ జంట కుమార్తెకు జన్మనిచ్చారు. ఈ ఏడాది జూన్‌లో షైఖా మహ్రా తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన బిడ్డను ఎత్తుకుని ఉన్న ఫోటోతోపాటు ‘మేమిద్దరం మాత్రమే’ అనే క్యాప్షన్‌తో పోస్ట్‌ చేసింది. ఇక జులై 16న తన భర్తపై నమ్మకం లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినట్లు తెలిస్తోంది. ఈ క్రమంలో విడాకుల గురించి యువరాణి బహిరంగంగా ప్రకటించి అందరికీ షాకిచ్చింది. యువరాణి నిర్ణయాన్ని నెటిజన్లు కొనియాడుతున్నారు. సరైన నిర్ణయం తీసుకున్నారంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.

కాగా యువరాణి షైఖా మహర్రా మహమ్మద్ రషీద్ అల్ మక్తూమ్ ప్రస్తుత దుబాయ్ పాలకుడు, వైస్ ప్రెసిడెంట్, యూఏఈ ప్రధానమంత్రిగా ఉన్న షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుమార్తె. బ్రిటన్‌లో ఉన్నతవిద్య అభ్యసించిన ఆమె అంతర్జాతీయ వ్యవహారాల్లో పట్టా పొందారు. ఆమె మహిళా సాధికారతకు కృషి చేస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.