శృంగార తార స్టార్మీ డేనియల్స్ అనైతిక ఆర్థిక ఒప్పందం కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టై విడుదలయ్యారు.అనైతిక ఆర్థిక ఒప్పందం కేసులో ఆయనపై నమోదైన అభియోగాలు కాగా.. ప్రస్తుతం న్యూయార్క్ కోర్టులో ఈ అంశాలపై విచారణ జరుగుతోంది. అయితే ట్రంప్ పై వేసిన పరువునష్టం కేసులో మాత్రం డేనియల్స్ కు మరసారి ఎదురుదెబ్బ పడింది. కాలిఫోర్నియాలోని 9వ యూఎస్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్.. స్టార్మీ డేనియల్స్ వాదనను తిరస్కరించింది. కోర్టు ఫీజులో భాగంగా ట్రంప్ తరపున న్యాయవాదులకు లక్షా 20 వేల డాలర్లు అంటే సుమారు కోటీ రూపాయలు చెల్లించాలని న్యాయస్థానం డెనియల్స్ ను ఆదేశించింది. మన్‌హటన్ న్యాయస్థానంలో ట్రంప్ హాజరైన రోజే వేరే కోర్టులో ఆయనకు ఈ విధంగా అనుకూలంగా తీర్పు వచ్చింది.
ట్రంప్ అరెస్టుకు, ఈ సివిల్ కేసుకు సంబంధం లేనప్పటికీ రెండు కూడా స్టార్మీ డేనియల్స్‌కు సంబంధించిన విషయాలే. గతంలో ట్రంప్‌పై ఆమె చేసిన ఆరోపణలపై స్పందిస్తూ.. కేవలం డబ్బు కోసమే ఇలాంటి బెదిరింపు ఆరోపణలు చేస్తుందని ట్రంప్ ఆరోపించారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై డేనియల్స్ 2018లో కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పరువునష్టం కేసులో స్టార్మీ డేనియల్స్ ఓడిపోవడంతోపాటు లీగల్ ఫీజు కింద ఆమె 2.93లక్షల డాలర్లు చెల్లించాలని స్థానిక కోర్టు ఆదేశించింది. అనంతరం పై కోర్టులో అప్పీలు చేసుకున్నప్పటికీ.. అక్కడ కూడా మరో 2.45లక్షలు డాలర్ల జరిమాన పడింది.తాజాగా ఇప్పుడు వచ్చిన కోర్టు తీర్పులోను డేనియల్స్ కు ఎదురుదెబ్బ తగిలింది. అయితే స్టార్మీ డెనియల్స్ ట్రంప్ తరపు అటర్నీలకు దాదాపు 6 లక్షల డాలర్లకు పైగా చెల్లించాల్సి ఉంటుంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం