Chandrababu: అబుదాబిలోని హిందూ మందిరాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు.. ఏమన్నారంటే.?

దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు తాజాగా అబుదాబిలోని BAPS హిందూ మందిరాన్ని సందర్శించారు. దాన్ని సందర్శించిన అనంతరం ఇది తన జీవితంలోనే అత్యంత అసాధారణ అనుభవాల్లో ఒకటిగా ఆయన అభివర్ణించారు. అదేంటో ఈ వీడియోపై ఓ లుక్కేయండి మరి. ఈ స్టోరీ చదవండి.

Chandrababu: అబుదాబిలోని హిందూ మందిరాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు.. ఏమన్నారంటే.?
Chandrababu In Baps Hindu M

Edited By: TV9 Telugu

Updated on: Oct 24, 2025 | 4:36 PM

దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు తాజాగా అబుదాబిలోని BAPS హిందూ మందిరాన్ని సందర్శించారు. దాన్ని సందర్శించిన అనంతరం ఇది తన జీవితంలోనే అత్యంత అసాధారణ అనుభవాల్లో ఒకటిగా ఆయన అభివర్ణించారు. బ్రహ్మవిహరిదాస్ స్వామి ఆయనకు సాదరంగా స్వాగతం పలికగా.. మందిరంలోని అద్భుతమైన కళానైపుణ్యాన్ని సీఎం చంద్రబాబుకు చూపించారు. మందిరంలోని ప్రతీ కళాకృతికు సంబంధించి సందేశాలను బ్రహ్మవిహారిదాస్ చంద్రబాబుకు వివరించారు. 3డీ వాల్ ఆఫ్ హార్మొనీని చూపిస్తూ.. ఇది మందిరం సమగ్రత సందేశాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. అలాగే కను శిల్పం ఆకృతిని, మందిరంలోని ఇతర విశిష్టలను తిలకించిన చంద్రబాబు.. ‘ఇది యువతకు చాలా అవసరం అని. మందిరం నిర్వాహకులు మన పూర్వకాలం విలువలను యువతకు అర్థం అయ్యేలా తీర్చిదిద్దారని వ్యక్తపరిచారు’

అలాగే మందిరంలోకి వెళ్ళేటప్పుడు సీఎం చంద్రబాబు దక్షిణాదికి చెందిన ఓ భక్తుడిని కలిశారు. అతడు మాట్లాడుతూ ‘నేను ఈ మందిరంలోకి వందకు పైగా సందర్శనల చేశాను. ఈ మందిరం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, ఇది నా ఇల్లు – మన మూలాలు, మన సంస్కృతి ఇక్కడ UAEలో నివసిస్తోందని గుర్తు చేశాడని.” పేర్కొన్నాడు. ఇంకా ఈ BAPS హిందూ మందిరం గురించి చంద్రబాబు ఏం అన్నారో ఆయన మాటల్లోనే ఈ వీడియో చూసేయండి.