AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బొద్దింకను కాల్చి చంపబోయి.. అపార్టుమెంటునే తగలబెట్టిన యువతి! ఆ తర్వాత సీన్‌ ఇదే..

South Korea Apartment fire accident: ఓ యువతి తన అపార్ట్‌మెంట్‌లో బొద్దింకను చంపేందుకు యత్నించి ఏకంగా అపార్టుమెంటే తగులబెట్టింది. అంతేనా సదరు యువతి ప్రయోగం వల్ల బొద్దింగ చచ్చిందో లేదోగానీ ఆమె పక్కింట్లో ఒకరు మరణించగా.. అనేక మంది ఆస్పత్రిపాలయ్యారు. ఈ విచిత్ర ఘటన క్షిణ కొరియాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..

బొద్దింకను కాల్చి చంపబోయి.. అపార్టుమెంటునే తగలబెట్టిన యువతి! ఆ తర్వాత సీన్‌ ఇదే..
South Korea Apartment Fire Accident
Srilakshmi C
|

Updated on: Oct 24, 2025 | 11:13 AM

Share

సాధారణంగా ప్రతి ఇంట్లో బొద్దింకలు కనిపిస్తాయి. ఇవి ఇల్లంతా తిరుగుతూ చికాకు తెప్పిస్తుంటాయి. వీటిని నిర్మూలించేందుకు జనాల పాట్లు అన్నీఇన్నీ కావు. కొందరు వీటి నిర్మూలనకు సొంత ప్రయోగాలు చేస్తుంటారు. అయితే ఇటీవల దక్షిణ కొరియాకు చెందిన ఓ యువతి కూడా తన అపార్ట్‌మెంట్‌లో బొద్దింకను చంపేందుకు యత్నించి ఏకంగా అపార్టుమెంటే తగులబెట్టింది. అంతేనా సదరు యువతి ప్రయోగం వల్ల బొద్దింగ చచ్చిందో లేదోగానీ ఆమె పక్కింట్లో ఒకరు మరణించగా.. అనేక మంది ఆస్పత్రిపాలయ్యారు. ఈ విచిత్ర ఘటన క్షిణ కొరియాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..

దక్షిణ కొరియాలోని ఒసాన్ నగరంకి చెందిన 20 ఏళ్ల యువతి ఓ పెద్ద అపార్ట్‌మెంటులో నివాసం ఉంటోంది. గత ఆదివారం ఆ యువతి ఫ్లాట్‌లో పనులు చేసుకుంటూ ఉండగా ఓ బొద్దింక కనిపించింది. దాంతో దాన్ని చంపడానికి ఆమెఫ్లేమ్‌త్రోవర్ (మండే స్వభావం కలిగిన స్ప్రే) ఉపయోగించి దాన్ని కాల్చిచంపాలని అనుకుంది. అయితే మండే స్వభావం ఉన్న ఈ స్ప్రేను బొద్దింకపై చల్లి లైటర్‌తో నిప్పంటించింది. ఆ బొద్దింక కాలిపోతూ ఇంట్లోని సామాగ్రి కిందకు వెళ్లడంతో మంటలు ఫ్లాట్‌ మొత్తం అంటుకున్నాయి.

కాసేపటికే ఆ మంటలు పక్క ఫ్లాట్లకు కూడా వ్యాపించాయి. ఐదో అంతస్తులో ఓ మహిళ, తన 2 నెలల బిడ్డ, భర్తతో ఉంటుంది. అయితే ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు భర్త బిడ్డతో క్షేమంగా అపార్ట్‌మెంట్‌ నుంచి కిందకు దిగాడు. ఆమె మాత్రం కిందకు దిగే ప్రయత్నంలో జారి పడిపోయి మృతి చెందింది. అపార్టుమెంటులో మంటలు, పొగ కారణంగా గ్రౌండ్ ఫోర్‌లో నివాసం ఉంటున్న 30 కుటుంబాల్లో మరో 8 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బొద్దింకను చంపబోయి ఇంతటి ఘోరానికి కారణమైన యువతిని పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
రజత్ పటిదార్ హాఫ్ సెంచరీ వృథా.. తొలి వన్డేలో ఇండియా-ఎ ఘోర పరాజయం
రజత్ పటిదార్ హాఫ్ సెంచరీ వృథా.. తొలి వన్డేలో ఇండియా-ఎ ఘోర పరాజయం
రైతులకు కేంద్రం దసరా కానుక.. అకౌంట్లోకి రూ.2 వేలు అప్పుడే..!
రైతులకు కేంద్రం దసరా కానుక.. అకౌంట్లోకి రూ.2 వేలు అప్పుడే..!
4 గుర్రాలను ముగ్గురు అన్నదమ్ములు ఎలా పంచుకోవాలి.. చిక్కుప్రశ్న
4 గుర్రాలను ముగ్గురు అన్నదమ్ములు ఎలా పంచుకోవాలి.. చిక్కుప్రశ్న
అమ్మవారికి చేపల నైవేద్యం.. 200 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం..
అమ్మవారికి చేపల నైవేద్యం.. 200 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం..
చర్మం మెరవాలన్నా.. బాడీ ఫిట్‌గా ఉండాలన్నా ఇవి తీసుకోవాల్సిందే..
చర్మం మెరవాలన్నా.. బాడీ ఫిట్‌గా ఉండాలన్నా ఇవి తీసుకోవాల్సిందే..
విరిగిన పుర్రె ఎముక .. ఫ్లైదుబాయ్ హీరోకు ఎమర్జెన్సీ ఆపరేషన్
విరిగిన పుర్రె ఎముక .. ఫ్లైదుబాయ్ హీరోకు ఎమర్జెన్సీ ఆపరేషన్
భారతదేశ రూపురేఖలు మార్చిన.. ప్రధాని మోదీ 25 విప్లవాత్మక ఆలోచనలు
భారతదేశ రూపురేఖలు మార్చిన.. ప్రధాని మోదీ 25 విప్లవాత్మక ఆలోచనలు
వలపు వల.. నేవీ ఉద్యోగులను మాయ చేసిన పాక్ మహిళా ఏజెంట్లు వీరేనట!
వలపు వల.. నేవీ ఉద్యోగులను మాయ చేసిన పాక్ మహిళా ఏజెంట్లు వీరేనట!
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్.. ముహూర్తం ఖారారు.. అప్పటినుంచే..
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్.. ముహూర్తం ఖారారు.. అప్పటినుంచే..
32 ఫోర్లు, 17 సిక్సర్లు.. ఎకానా గడ్డ.. సర్పంచ్ సాబ్ అడ్డా
32 ఫోర్లు, 17 సిక్సర్లు.. ఎకానా గడ్డ.. సర్పంచ్ సాబ్ అడ్డా