Earthquake: ప్రకృతి పగబట్టిందా ఏంటి..? టర్కీని వదలని భూకంపాలు.. 6.4 తీవ్రతతో కుదిపేసిన మరో భూకంపం..

|

Feb 21, 2023 | 6:38 AM

తీవ్ర భూకంపం ధాటికి అతలాకుతలమైన టర్కీని మరోసారి భారీ భూకంపం కుదిపేసింది. హతాయ్‌ ప్రావిన్సులో సోమవారం మరోసారి తీవ్ర భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.4గా నమోదైంది. ఈ మేరకు..

Earthquake: ప్రకృతి పగబట్టిందా ఏంటి..? టర్కీని వదలని భూకంపాలు.. 6.4 తీవ్రతతో కుదిపేసిన మరో భూకంపం..
Turkey Earthquake
Follow us on

తీవ్ర భూకంపం ధాటికి అతలాకుతలమైన టర్కీని మరోసారి భారీ భూకంపం కుదిపేసింది. హతాయ్‌ ప్రావిన్సులో సోమవారం మరోసారి తీవ్ర భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.4గా నమోదైంది. ఈ మేరకు టర్కీ విపత్తు నిర్వహణ సంస్థ వివరాలు వెల్లడించింది. ఈ తీవ్రతకు ఇప్పటికే బలహీనపడిన కొన్ని భవనాలు కూలిపోయాయి. భూకంపం ప్రభావం సిరియా, జోర్డాన్‌, ఇజ్రాయెల్‌ దేశాల్లోనూ స్వల్పంగా కనిపించింది. ఈ ప్రమాదం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం తీవ్రత అధికంగా ఉండేలా తెలుస్తోంది. లటాకియాలో రెండుసార్లు దాదాపు 10 సెకన్ల పాటు భూ ప్రకంపనలు వచ్చాయి. భూకంపం వచ్చిన సమయంలో ప్రజలు ఇళ్లు, హోటల్, భవనాల నుంచి ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు.

ఫిబ్రవరి 6న టర్కీ, పొరుగున ఉన్న సిరియాలో 7.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ వరుస భూకంపాలతో 46 వేలకు మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పది లక్షల మంది నిరాశ్రయలు అయ్యారు. భూకంప ధాటికి చెల్లాచెదురైన టర్కీకి పెద్ద ఎత్తున సాయం అందిస్తోంది భారత్. ఆపరేషన్ దోస్త్ పేరిట సహాయక చర్యల్లో పాల్గొంటోంది. భారత్‌ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చి తమకు ఎంతో సాయం చేస్తున్నాయని, అండగా ఉంటున్నారని ఆ దేశ ప్రజలు చెప్పారు.

ప్రకృతి బీభత్సానికి టర్కీ, సిరియాలు విలవిల్లాడిపోయాయి. రెండు వారాల క్రితం తెల్లవారు జామున వచ్చిన పెను భూకంపం ధాటికి రెండు దేశాలు వణికిపోయాయి. భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. జనాలు శిథిలాల కిందే ప్రాణాలు కోల్పాయారు. ఈ విపత్తు ధాటికి.. రెండు దేశాల్లో కలిపి చనిపోయిన వారి సంఖ్య 46 వేలు దాటింది. టర్కీలోనే 40 వేలకు మందికి పైగా మృతి చెందారు. సిరియాలో 5800 కు పైగా చనిపోయారు.

ఇవి కూడా చదవండి

భూకంపం కారణంగా 1,05,794 భవనాలు ప్రభావితం అయ్యాయి. ఇప్పటికే 20,662 భవనాలు పూర్తిగా కూలిపోయాయి. టర్కీతో పాటు సిరియాలోనూ ఆస్తినష్టం భారీగానే ఉంటారు. సిరియాలోనూ భారీగా ఆస్తి నష్టం చోటుచేసుకుందని వెల్లడించింది. భూకంపం ధాటికి వేల సంఖ్యలో భవనాలు నేలమట్టం కావడంతో అక్కడి పర్యావరణ పరిస్థితులపై ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు.. టర్కీలో సహాయక చర్యల కోసం భారత్‌ నిర్వహించిన ‘ఆపరేషన్‌ దోస్త్‌’ ముగిసింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం