Germany election 2021: జర్మనీ మొట్టమొదటి మహిళా ఛాన్స్‌లర్, శక్తిమంతమైన నాయకురాలు ఏంజెలా మెర్కెల్ శకం ముగిసింది. 16 ఏళ్లపాటు అధ్యక్ష పదవిలో సుదీర్ఘకాలం పాటు కొనసాగిన ఏంగెలా మెర్కెల్ పార్టీ ఓటమి పాలయింది. ఆదివారం జరిగిన జర్మనీ ఎన్నికల్లో సోషల్ డెమొక్రాట్లు గెలుపుతీరానికి చేరారు. అయితే.. ఈ ఎన్నికల్లో సెంటర్-లెఫ్ట్ సోషల్ డెమోక్రాట్స్ (SPD) 26.0% ఓట్ల ఆధిక్యంలో ఉండగా.. మెర్కెల్ పార్టీ CDU/CSU కన్జర్వేటివ్ బ్లాక్ 24.5% శాతం ఓట్లు సాధిస్తుందని సర్వేలు అంచనా వేశాయి. జర్మనీ పార్లమెంట్ ఎన్నికల అనంతరం.. అధ్యక్ష పదవిలో సుదీర్ఘకాలం పాటు కొనసాగిన ఏంగెలా మెర్కెల్ తరువాత ఆ పదవిని చేపట్టేది ఎవరోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఉన్నట్లు కనిపించకపోయినప్పటికీ.. మోర్కెల్ కూటమి వెనుకంజలో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా, పలు సర్వేలు వెల్లడించాయి. కాగా.. అన్ని సర్వేలలో తామే ముందంజలో ఉన్నట్లు సోషల్ డెమొక్రాట్స్ ఛాన్సలర్ అభ్యర్థి ఓలాఫ్ స్కోల్జ్ ఓటు వేసిన తర్వాత పేర్కొన్నారు. ఈ మేరకు అభ్యర్థులతో రౌండ్ టేబుల్ చర్చలో పాల్గొన్నారు. ఇది మంచి సందేశమని ఆచరణాత్మక ప్రభుత్వం లభించేలా ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే.. కూటమితోనే ప్రభుత్వం ఏర్పడేలా ఉన్నట్లు మీడియా తెలిపింది. ప్రభుత్వం ఏర్పాటుకు కొన్ని నెలల సమయం పట్టే అవకాశముందని వెల్లడించింది.
కాగా.. ఎంజెలా మెర్కెల్ పదవీకాలం శనివారంతో ముగిసింది. అయితే.. మరలా జరిగే ఎన్నికల్లో పోటీ చేయబోనని మెర్కెల్ గతంలోనే ప్రకటించారు. తన రాజకీయ వారసుడిగా ఆర్మిన్ లాషెట్‌ను ప్రకటించారు. శనివారం ఆమె ఆర్మిన్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మెర్కెల్ 16 ఏళ్లుగా జర్మనీకి చాన్స్‌లర్‌గా ఉన్నారు. ఈ సుదీర్ఘకాలంలో ఆమె జర్మనీని ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలపడంతోపాటు అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించారు. ఈయూ-ప్రపంచం మధ్య సత్సంబంధాలు నెలకొల్పడంలో ముఖ్య పాత్ర వహించారు. ఈయూలో జర్మనీని అత్యంత శక్తిమంతమైన దేశంగా నిలిపారు. 2007లో ఆర్థిక సంక్షోభం, గ్రీకు అప్పుల సంక్షోభం, 2016లో బెర్లిన్‌లో ఉగ్రవాద దాడులు, బ్రెగ్జిట్, కొవిడ్ ఇలా ఎన్నింటినో ఆమె సమర్థంగా ఎదుర్కొన్నారు.
Also Read: