ట్రంప్ మెడకు అభిశంసన ఉచ్చు.. ఉంటాడా ? పోతాడా ??

ఒకవైపు వచ్చే సంవత్సరం జరగనున్న ఎన్నికల్లోను విజయం సాధించి రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపడతానంటూ డొనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేస్తుంటే ఇంకోవైపు ఆయనను తరుముకొస్తోంది అభిశంసన తీర్మానం. తాజాగా ట్రంప్‌ అభిశంసన ప్రక్రియ చేపట్టేందుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ప్రతిపక్ష డెమోక్రాట్ల ఆధిక్యత ఉన్న సభలోని మొత్తం 435 మంది సభ్యుల్లో తీర్మానానికి అనుకూలంగా 232 మంది ఓటేయగా 196 మంది వ్యతిరేకించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోడానికే ట్రంప్‌పై అభిశంసన చేపట్టామని అని […]

ట్రంప్ మెడకు అభిశంసన ఉచ్చు.. ఉంటాడా ? పోతాడా ??
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 01, 2019 | 7:13 PM

ఒకవైపు వచ్చే సంవత్సరం జరగనున్న ఎన్నికల్లోను విజయం సాధించి రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపడతానంటూ డొనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేస్తుంటే ఇంకోవైపు ఆయనను తరుముకొస్తోంది అభిశంసన తీర్మానం. తాజాగా ట్రంప్‌ అభిశంసన ప్రక్రియ చేపట్టేందుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ప్రతిపక్ష డెమోక్రాట్ల ఆధిక్యత ఉన్న సభలోని మొత్తం 435 మంది సభ్యుల్లో తీర్మానానికి అనుకూలంగా 232 మంది ఓటేయగా 196 మంది వ్యతిరేకించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోడానికే ట్రంప్‌పై అభిశంసన చేపట్టామని అని స్పీకర్‌ నాన్సీ పెలోసి అంటుండగా, ఈ చర్యను రిపబ్లికన్లు తప్పుపడుతున్నారు. కాగా ట్రంప్‌ పార్టీ రిపబ్లికన్ల ఆధిక్యత ఉన్న సెనేట్‌లో ఈ తీర్మానం వీగిపోతుందన్న ధీమాతో వుంది.
అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభిశంసనకు ప్రతిపక్ష డెమోక్రాట్లు అమెరికా ప్రతినిధుల సభలో పావులు కదిపారు. ట్రంప్‌ తన రాజకీయ ప్రత్యర్థి, డెమోక్రాట్‌ నేత జో బిడెన్‌పై అవినీతి ఆరోపణలు మోపి, ఉక్రెయిన్‌ ప్రభుత్వంపై వత్తిడి తెచ్చారన్న ఆరోపణల నేపథ్యంలో స్పీకర్‌ నాన్సీ పెలోసి ఆయనపై  తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ప్రతినిధుల సభలో 435 మంది సభ్యుల్లో తీర్మానానికి అనుకూలంగా 232 మంది ఓటేశారు. 196 మంది వ్యతిరేకించారు.
అమెరికా రాజ్యాంగ పరిరక్షణ కోసమే అధ్యక్షునిపై అభిశంసన నిర్ణయం తీసుకున్నాం అంటున్నారు స్పీకర్‌ నాన్సీ పెలోసి. ఈ తీర్మానానికి రిపబ్లికన్లు ఎందుకు భయపడుతున్నారో చెప్సాల్సిన అవసరం ఉందన్నారామె. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికే ఈ తీర్మానం అంటున్నారు పెలోసి.
అధ్యక్షుడు ట్రంప్‌పై నాన్సి పోలోసితో పాటు డెమోక్రట్లు ప్రవేశ పెట్టిన అభిశంసన తీర్మానాన్ని తప్పు పట్టారు రిపబ్లికన్‌ పార్టీ సభ్యులు. సోవియట్‌ యూనియన్‌ తరహా రూల్స్‌ చెల్లవని స్పీకర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు రిపబ్లికన్‌ సభ్యుడు స్టీవ్‌ స్కాలిన్‌.
కాగా కొందరు రిపబ్లికన్లు కూడా ట్రంప్‌పై అభిశంసనకు మద్దతు ఇస్తున్నారు.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని గుర్తుంచుకోవాలని ఆ పార్టీకి చెందిన జిమ్‌ మెక్‌గోవర్న్‌ అంటున్నారు. డెమెక్రాట్లు అధ్యక్షుని బ్యాలెట్‌ పద్దతిలో ఓడించలేక ఇలాంటి తీర్మానాల ద్వారా తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు సభలోని మైనారిటీ సభ్యుడు కెవిన్‌.
అమెరికా ప్రతినిధుల సభలో అధికార రిపబ్లికన్లకన్నా ప్రతిపక్ష డెమోక్రట్‌లదే పై చేయికావడంతో తీర్మానం తేలికగా నెగ్గింది. అయితే సెనేట్​లో అధికార రిపబ్లికన్ పార్టీ 53 సీట్లతో మెజారిటీ కలిగి ఉంది. డెమోక్రాట్లకు 47 సీట్లు మాత్రమే ఉన్నాయి. కనుక సెనేట్​లో అభిశంసన తీర్మానం నెగ్గే అవకాశం లేదు. అమెరికా చరిత్రను గమనించినట్లయితే  దేశాధ్యక్షుడిపై ఇలా అభిశంసన తీర్మానం నెగ్గడం ఇది మూడోసారి. ఇప్పటి వరకు ఆండ్రూ జాన్సన్​, బిల్​ క్లింటన్​ అభిశంసనకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. అయితే సెనేట్​లో మాత్రం వారి అభిశంసన తీర్మానం వీగిపోయింది. ఇప్పటి వరకు అభిశంసన ప్రక్రియ ద్వారా ఏ అమెరికా అధ్యక్షుడినీ తొలగించలేదు.

ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
శరీంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
శరీంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా