ఐసిస్‌‌కు కొత్త చీఫ్‌.. లేపేస్తానంటోన్న ట్రంప్

ఐసిస్ కొత్త చీఫ్‌గా అబూ ఇబ్రహీం అల్ హష్మీ అల్ ఖురేషిని ఎంపిక చేసినట్లు ఆ సంస్థ సెంట్రల్ మీడియా, అల్ ఫుర్కాన్ ఫౌండేషన్ అధికార ప్రతినిధి గురువారం ఓ ఆడియో ప్రకటనను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా ‘‘ఐసిస్ కొత్త నాయకుడు పండితుడని, ప్రసిద్ధ యోధుడని, యుద్ధ వీరుడని.. అతడు అమెరికా దళాలతో పోరాడుతాడు’’ అంటూ ఆ అధికార ప్రతినిధి అమెరికాకు వార్నింగ్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో కొత్త చీఫ్‌పై అమెరికా అధ్యక్షుడు […]

  • Updated On - 11:38 am, Sat, 2 November 19 Edited By:
ఐసిస్‌‌కు కొత్త చీఫ్‌.. లేపేస్తానంటోన్న ట్రంప్

ఐసిస్ కొత్త చీఫ్‌గా అబూ ఇబ్రహీం అల్ హష్మీ అల్ ఖురేషిని ఎంపిక చేసినట్లు ఆ సంస్థ సెంట్రల్ మీడియా, అల్ ఫుర్కాన్ ఫౌండేషన్ అధికార ప్రతినిధి గురువారం ఓ ఆడియో ప్రకటనను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా ‘‘ఐసిస్ కొత్త నాయకుడు పండితుడని, ప్రసిద్ధ యోధుడని, యుద్ధ వీరుడని.. అతడు అమెరికా దళాలతో పోరాడుతాడు’’ అంటూ ఆ అధికార ప్రతినిధి అమెరికాకు వార్నింగ్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో కొత్త చీఫ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.

ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేసిన ట్రంప్.. ‘‘ఐసిస్‌కు కొత్త లీడర్ వచ్చాడు. అతడెవరో కూడా మాకు బాగా తెలుసు’’ అంటూ పేర్కొన్నారు. ఆయన మాటలను బట్టి చూస్తుంటే.. కొత్త చీఫ్‌ను లేపేసేందుకు ట్రంప్ అప్పుడే సన్నాహాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే బాగ్దాదీ మరణంపై ఇదివరకు కూడా వార్తలు రాగా.. అప్పుడు అల్ బకర్ వారసుడిగా హష్మీ పేరు చాలాసార్లే వినిపించింది.

కాగా ఉత్తర సిరియా ప్రాంతంలో కుర్దు సేనలతో కలిసి అమెరికా భద్రతా దళాలు చేసిన దాడుల్లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ బాగ్దాదీ హతమయ్యాడు. దళాల నుంచి తప్పించుకోలేకపోయిన బాగ్దాదీ తనకు తానే ఆత్మాహుతి దాడి చేసుకున్నాడు. ఈ ఘటనలో అతడి ఇద్దరు కుమారులు కూడా ముక్కలు ముక్కలు అయిపోయారు. ఆ తరువాత బాగ్దాదీ అనుచరుడిని కూడా మట్టుబెట్టారు.