Worlds Richest Man: సంపాదంలోనే కాదు దానంలోనూ టాప్ అమెజాన్ సీఈవో.. ఎంతమొత్తంలో దానం చేశారో తెలుసా..

తాను సంపాదనలోనే కాదు... భూరి విరాళం అందించడంలోనూ మొదటి స్థానమే అంటూ ప్రత్యేకతను చాటుకున్నారు ప్రపంచ కుబేరుడు, అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్. 2020 ఏడాదిలో

Worlds Richest Man: సంపాదంలోనే కాదు దానంలోనూ టాప్ అమెజాన్ సీఈవో.. ఎంతమొత్తంలో దానం చేశారో తెలుసా..
Follow us

|

Updated on: Jan 05, 2021 | 9:02 PM

Worlds Richest Man Charity : తాను సంపాదనలోనే కాదు… భూరి విరాళం అందించడంలోనూ మొదటి స్థానమే అంటూ ప్రత్యేకతను చాటుకున్నారు ప్రపంచ కుబేరుడు, అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్. 2020 ఏడాదిలో స్వచ్ఛంద కార్యక్రమాలకు అధికంగా ఖర్చుచేసిన వారిలో బెజోస్ ముందున్నారు. గత ఏడాది వాతావరణ మార్పులపై పోరాటం కోసం 10 బిలియన్ డాలర్లను అంటే (సుమారు రూ.73 వేల కోట్లు)భారీ మొత్తాన్ని స్వచ్ఛంద కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చారు. 2020లో ఇదే అతిపెద్ద మొత్తంలో డొనేషన్. దీంతో జెఫ్‌ బెజోస్ సంపాదన ఆర్జనలోనే కాదు విరాళాలివ్వడంలో కూడా తానే మేటి అని నిరూపించుకున్నారు. జెఫ్ బెజోస్ నికర ఆదాయం దాదాపు 188 బిలియన్ డాలర్లు. బెజోస్ ఎర్త్ ఫండ్ ద్వారా అతను పెద్ద మొత్తంలో డొనేట్ చేస్తున్నారు. వాతావరణ సంక్షోభంలో చిక్కుకున్న లాభాపేక్షలేని సంస్థలకు బెజోస్ ఎర్త్ ఫండ్ మద్దతు ఇస్తోంది. ఎర్త్ ఫండ్ ద్వారా ఆయన ఇప్పటి వరకు 16 గ్రూప్స్‌కు 790 మిలియన్ డాలర్ల సహకారం అందించినట్లు క్రానికల్ ఆఫ్ ఫిలాంత్రపీస్ తెలిపింది.

ది క్రానికల్ ఆఫ్ ఫిలాంత్రఫీ ప్రకటించిన వార్షిక జాబితాలో అమెజాన్‌ సీఈఓ ముందు వరసలో నిలిచారు. బెజోస్‌ను మినహాయిస్తే టాప్ 10 విరాళాలు 2011తో పోలిస్తే తక్కువగా ఉన్నట్లు.. మిగిలిన టాప్ 10 విరాళాల మొత్తం కేవ‌లం 260 కోట్ల డాల‌ర్లు మాత్రమేనని తెలిపింది. 2011 త‌ర్వాత ఇంత త‌క్కువ స్థాయిలో విరాళాలు రావ‌డం ఇదే తొలిసారని ప్రకటించింది. బెజోస్‌ తర్వాత గత ఏడాది భారీ మొత్తంలో విరాళాలిచ్చిన వారి జాబితాలో నైక్‌ వ్యవస్థాపకుడు ఫిల్‌నైట్‌ దంపతులు వరసగా రెండు మూడు స్థానాల్లో నిలిచారు. వీరిద్దరూ నైట్ ఫౌండేషన్‌కు 900 మిలియన్లు డార్లు, ఒరెగాన్ విశ్వవిద్యాలయానికి 300 మిలియన్ల డాలర్లు డొనేట్‌ చేశారు. ఇక ఈ జాబితాలో ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌ బర్గ్‌, భార్య ప్రిస్కల్లా చాన్‌ నాల్గవ స్థానంలో నిలిచారు. చాలామంది బిలియనీర్ల సంపద గత ఏడాదిలో భారిగా పెరిగినప్పటికీ.. విరాళాలు తగ్గాయని తెలిపింది.

Also Read: మీరు జాగ్రత్తగా లేకపోతే మీబ్యాంక్ అకౌంట్ ఖాళీ అంటూ కస్టమర్లను హెచ్చరించిన ఎస్బీఐ