Wealth Records in 2020: గతఏడాదిలో పెరిగిన వీరిద్దరి సంపాదనతో అమెరికాలోని 10కోట్లమందికి సుమారు 2వేల డాలర్ల పంచవచ్చట..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తూ.. ఆర్ధిక మూలాలపై ప్రభావం చూపించింది. అయితే కోవిడ్ ప్రభావం సామాన్యులపైనే గానీ ప్రపంచంలోని అత్యంత ధనికులపై..
Wealth Records in 2020: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తూ.. ఆర్ధిక మూలాలపై ప్రభావం చూపించింది. అయితే కోవిడ్ ప్రభావం సామాన్యులపైనే గానీ ప్రపంచంలోని అత్యంత ధనికులపై ఏ మాత్రం లేదని బ్లూమ్‌బర్గ్ నివేదిక ద్వారా తెలుస్తోంది. తాజాగా 2020 ఏడాదికి గాను బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం గతఏడాది అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంపద 217 బిలియన్ డాలర్లు పెరిగిందని తెలుస్తోంది. వీరిద్దరికీ ఒక్కయేడాదిలో పెరిగిన సంపదతో.. అమెరికాలోని 10 కోట్లమందికి.. ఒక్కొక్కరికీ సుమారు 2,000 డాలర్ల చెక్కులు ఇవ్వవచ్చు అని బ్లూమ్‌బర్గ్ అంచనా వేసింది. ప్రపంచంలో టాప్ 500 కుబేరుల సంపద గత ఏడాది 31 శాతం పెరిగింది. గత ఎనిమిదేళ్ల కాలంలో కుబేరులకు ఇదే అత్యధికమని బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్‌లు ప్రపంచ టాప్ తొలి, రెండో స్థానాల్లో నిలిచారు. ఎలాన్ మస్క్ సంపద 2020లో హఠాత్తుగా భారీ స్థాయిలో పెరిగింది. ప్రధానంగా టెస్లా షేర్లు పెరగడంతో ఆయన ఆదాయం 75 శాతం వరకు పెరిగింది.
కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా సామాన్యులపై భారీగా ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో అమెరికా ఇటీవల ఆర్థిక ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. అమెరికన్లకు ఏ మేరకు, ఎలా సాయం అందుతుందనే అంశం చర్చలో ఉండగానే, అమెరికా కుబేరుల సంపద 2020లో రికార్డ్ స్థాయిలో పెరగడం గమనార్హం. అమెరికా ప్యాకేజీ కరోనా, లాక్ డౌన్, ఆర్థిక అస్తవ్యస్థత కారణంగా అమెరికాలో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు