SBI Customers Alert: మీరు జాగ్రత్తగా లేకపోతే మీబ్యాంక్ అకౌంట్ ఖాళీ అంటూ కస్టమర్లను హెచ్చరించిన ఎస్బీఐ

ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వినియోగదారులకు సోషల్ మీడియా వేదికగా కొన్ని సూచనలను ఇచ్చింది....

SBI Customers Alert: మీరు జాగ్రత్తగా లేకపోతే మీబ్యాంక్ అకౌంట్ ఖాళీ అంటూ కస్టమర్లను హెచ్చరించిన ఎస్బీఐ
Follow us

|

Updated on: Jan 05, 2021 | 7:55 PM

SBI Customers Alert: ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వినియోగదారులకు సోషల్ మీడియా వేదికగా కొన్ని సూచనలను ఇచ్చింది. మోసగాళ్ల బారిన పడకుండా ఉండాలని కస్టమర్లను హెచ్చరిస్తుంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండలని.. రోజు రోజుకీ సైబర్ నేరగాళ్లు పెరిగిపోయారని తన వినియోగదారులను అలర్ట్ చేస్తుంది.

మోసగాళ్లు సోషల్ మీడియాలో మోసపూరిత మెసేజ్‌లు పంపిస్తూ ఉంటారని వీటితో జాగ్రత్తగా ఉండాలని, వారి ఉచ్చులో పడొద్దని తన ఖాతాదారులను హెచ్చరించింది. ‘కస్టమర్లు సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం. ఫేక్ మెసేజ్‌ల బారిన పడొద్దు. తప్పుదోవ పట్టించే మెసేజ్‌లతో అప్రమత్తంగా ఉండాలి. మీరు జాగ్రత్తగా లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోవచ్చునని ఎస్‌బీఐ ట్విట్టర్ వేదికగా తెలిపింది దేశీ అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ.