Taliban-Panjshir: పోరాడి ఓడారా.. కుట్రలు, కుయుక్తుల మందు లొంగిపోయారా.. కాలకేయులు చేతుల్లోకి పంజ్‌షిర్‌‌..

| Edited By: Ravi Kiran

Sep 06, 2021 | 10:47 AM

లోయను కైవసం చేసుకోవడంలో 20ఏళ్ల క్రితం విఫలమైన తాలిబన్లు ఈసారి మాత్రం జులుం చూపించారు. తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడిన....

Taliban-Panjshir: పోరాడి ఓడారా.. కుట్రలు, కుయుక్తుల మందు లొంగిపోయారా.. కాలకేయులు చేతుల్లోకి పంజ్‌షిర్‌‌..
Panjshir Valley
Follow us on

పోరాడి ఓడారా..! తాలిబన్ల కుట్రలు, కుయుక్తుల మందు లొంగిపోయారా.. ! ఏదైతేనేం.. పంజ్‌షిర్‌ కూడా తాలిబన్ల కైవసం అయిపోయింది. ఆప్గన్‌ను లాగేసుకున్న తాలిబన్లు, పంజ్‌షిర్‌ విషయంలో మాత్రం తడబడ్డారు. అక్కడి లోయను కైవసం చేసుకోవడంలో 20ఏళ్ల క్రితం విఫలమైన తాలిబన్లు ఈసారి మాత్రం జులుం చూపించారు. తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడిన నార్తన్‌ అలయెన్స్ బలగాలు ఎట్టకేలకు వెనక్కి తగ్గాయి. దీనికి కారణం.. పంజ్‌షిర్ సైన్యాన్ని నడిపిస్తున్న అమ్రూల్లా సలేహ్‌ ఇంటిని తాలిబన్లు డ్రోన్‌లతో పేల్చేయడం, ఇంకా లొంగకపోతే.. అంతం చేస్తాంటూ వార్నింగ్‌లు ఇచ్చారు. దీనికి తోడు.. తిరుగుబాటు బలగాలను నడిపిస్తున్న కమాండర్‌ను కూడా తాలిబన్లు చంపేశారు..

ఈ పరిస్థితుల్లో చేసేదేమీ లేక పంజ్‌షిర్‌ లొంగింది. తాలిబన్లతో చర్చలకు సిద్దమని ప్రకటించింది. సో.. పంజ్‌షిర్‌ కూడా తాలిబన్ల వశమైంది. ఆ మేరకు తాలిబన్లు ఓ అధికారిక పత్రాన్ని కూడా విడుదల చేశారు. అంతేకాదు.. పంజ్‌షిర్‌ నాయకులు కోరినట్లుగా చర్చలకు సిద్ధమంటూ లోకల్‌గా ఉన్న గవర్నర్ కార్యాలయంపై తెల్ల జెండా ఎగురవేశారు.

పంజ్‌షిర్‌లోని గవర్నర్ కార్యాలయం దగ్గర వైట్ ఫ్లాగ్ ఎగరవేసిన తాలిబన్ సేనల ఫోటో మనం ఇక్కడ చూడొచ్చు.మరోవైపు మొత్తం స్వాధీనం అయిపోయింది కాబట్టి.. అంతర్జాతీయ సమాజం తాలిబన్ రాజ్యాన్ని గుర్తించేలా ఓ రిక్వెస్ట్ చేశారు తాలిబన్లు. ఐక్యరాజ్యసమితి నుంచి పాలనా పరమైన సాయం కోరారు.

Panjshir

ఇవి కూడా చదవండి: డుగ్గు డుగ్గు డ్యాన్స్‌తో అదరగొట్టిన టీఆర్‌ఆస్‌ ఎమ్మెల్యే.. ‘బుల్లెట్‌ బండి’ రాజయ్య స్టెప్పులు

YCP Leader Warning: పనులు ఆపేస్తారా.. దాడులు చేయమంటారా..కాంట్రాక్టర్‌కు అధికార పార్టీ నాయకుడి వార్నింగ్‌

Mysterious Fever: చిన్నారులను వెంటాడుతున్న మరో అంతుచిక్కని జ్వరం.. 48 గంటల్లో 50 మంది మృతి..