AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Taliban Rule: పాత సైనికులను కలుపుకుని కొత్త సైన్యాన్ని ఏర్పాటు చేస్తామంటున్న తాలిబన్లు.. ఎందుకంటే..

ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించిన ఒక నెల తరువాత, తాలిబాన్ దేశం కోసం కొత్త సైన్యాన్ని సిద్ధం చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ పని త్వరలో పూర్తవుతుందని చెప్పింది. 

Taliban Rule: పాత సైనికులను కలుపుకుని కొత్త సైన్యాన్ని ఏర్పాటు చేస్తామంటున్న తాలిబన్లు.. ఎందుకంటే..
Taliban Rule
KVD Varma
|

Updated on: Sep 16, 2021 | 9:59 PM

Share

Taliban Rule: ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించిన ఒక నెల తరువాత, తాలిబాన్ దేశం కోసం కొత్త సైన్యాన్ని సిద్ధం చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ పని త్వరలో పూర్తవుతుందని చెప్పింది.  ఆపద్ధర్మ ప్రభుత్వంలోని చీఫ్ ఆఫ్ స్టాఫ్ క్వారీ ఫసియుద్దీన్ ప్రకారం, కొత్త ఆఫ్ఘన్ సైన్యంలో మునుపటి పాలనలో సైన్యంలో భాగమైన మాజీ సైనికులు కూడా ఉంటారు. ఖారీ చెప్పారు- ఆఫ్ఘనిస్తాన్ బయట, లోపల నుండి ఎలాంటి బెదిరింపులు ఎదురైనా, వాటిని ఎదుర్కోవడానికి మా సైన్యం సిద్ధంగా ఉంటుంది.

దేశ భద్రతపై దృష్టి సారించిన తాలిబాన్ తన సైన్యాన్ని నిర్మించడానికి సిద్ధమైంది. టోలో న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, కరి మాట్లాడుతూ- మేము మా దేశాన్ని చాలా ప్రేమిస్తున్నాము. ఇతర దేశాల మాదిరిగానే, మనం కూడా ఒక సాధారణ సైన్యాన్ని కలిగి ఉండాలి. అది చాలా త్వరగా జరుగుతుంది. దీని ద్వారా మన ప్రజలను, మన సరిహద్దులను కూడా కాపాడుతాము.

ఖారీ  ఇంకా చెప్పారు – మునుపటి పాలనలో  సైన్యంలో ఉన్నవారిలో సమర్ధులు మన సైన్యంలో చేరతారు. ఇది శిక్షణ పొందిన తాలిబాన్లను కూడా కలిగి ఉంటుంది. పాత సైనికులు ముందుకు వచ్చి తమ విధుల్లో చేరాలి. మాజీ సైనికాధికారి షకురుల్లా సుల్తానీ మాట్లాడుతూ – ప్రస్తుతం ఖాళీగా ఉన్న 3 లక్షల మంది మాజీ సైనికుల గురించి తాలిబాన్లు ఆలోచించాలన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రస్తుతం సాధారణ సైన్యం లేదు. తాలిబాన్లు నగరాలు, సరిహద్దులలో నిలబడ్డారు. వారి వద్ద కొన్ని కొత్త, కొన్ని పాత ఆయుధాలు ఉన్నాయి.

తాలిబాన్లు  డ్యూరాండ్  లైన్‌ని విశ్వసించరు. పాకిస్తాన్.. ఆఫ్ఘనిస్తాన్‌ను వేరుచేసే సరిహద్దును డ్యూరాండ్ లైన్ అంటారు. పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం, ISI తాలిబన్లతో కలిసి ఉన్నట్లు అనిపించినప్పటికీ, నిజం కూడా తాలిబాన్లు డ్యూరాండ్ లైన్‌ని నమ్మలేదు. పాకిస్తాన్ లోని అన్ని పష్టున్ ప్రాంతాలు  అన్నీ ఆఫ్ఘనిస్తాన్‌లో భాగమేనని వారు అంటారు. 

ఈ లైన్‌లో పాకిస్తాన్ 90% వరకు ముళ్ల కంచె వేసింది. అయితే, తాలిబాన్ ప్రతినిధి జబివుల్లా ముజాహిద్ ఈ చర్యను సహించబోనని ఇటీవల స్పష్టం చేశారు. బ్రిటీష్ పాలనలో, 1893 నవంబర్ 12 న, అప్పటి ఆఫ్ఘన్ పాలకుడు అమీర్ అబ్దుల్ రహమాన్, బ్రిటిష్ ఇన్‌ఛార్జ్ హెన్రీ మెర్టిమర్ డురాండ్ మధ్య సరిహద్దు ఒప్పందం కుదిరింది. దీనిని బ్రిటిష్ అధికారి పేరు మీద డ్యూరాండ్ లైన్ అంటారు.

ఇవి కూడా చదవండి:

North Korea Missiles: రైలు నుంచి క్షిపణి పరీక్ష.. ప్రపంచవ్యాప్తంగా హీట్ పెంచిన ఉత్తరకొరియా.. భద్రతా మండలి ఆందోళన!