Afghanistan Crisis: వాటర్ బాటిల్ రూ. 3వేలు.. భోజనం రూ.7,500.. కాబుల్ ఎయిర్ పోర్ట్ పరిసరాల్లో తాలిబన్ల అరాచకం..
కనీసం తాగేందుకు మంచి నీటి కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆహారం దొరికితే చాలు అని జీవనం గడుపుతున్నారు. ఆహరం అందక కొందరు నీరసంతో సొమ్మసిల్లిపోతున్నారు. ఎయిర్ పోర్టు బయట తాగునీటిని...
ఆఫ్ఘన్లో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. కాబూల్ వీథుల్లో హల్చల్ చేస్తున్నారు. ఎయిర్ పోర్ట్ దగ్గర కనిపిస్తే చాలు..కిడ్నాప్ చేస్తుండటంతో పాటు..వారిపై దాడులకు తెగబడుతున్నారు. మరోవైపు కాబూల్‌లో ఉక్రెయిన్ విమానం హైజాక్ అయింది. శాంతి వచనాలు వళ్లిస్తూనే అఫ్గన్లిస్థాన్‌లో తాలిబన్లు విధ్వంసాలకు పాల్పడుతున్నారు. పిచ్చెక్కిన కోతుల్లా ప్రవర్తిస్తున్నారు. ఇన్నాళ్లు కొండలు, గుట్టలు రాళ్లు రప్పలకే పరిమితమైన తాలిబన్స్ ఇప్పుడు అధికారంలోకి రావడంతో.. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు రెచ్చిపోతున్నారు. దేశంలో యుద్ధం ముగిసిందని ప్రకటించిన ఈ ముష్కరమూక.. ఇప్పుడు విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ.. ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబుల్‌లోకి తాలిబన్లు ప్రవేశించినది మొదలు అరాచకాలు మరింతగా పెరిగిపోయాయి. దీనిని ప్రపంచమంతా మౌనంగా గమనిస్తోంది. ముఖ్యంగా కాబుల్ ఎయిర్‌పోర్టు వద్ద అఫ్ఘాన్ పౌరులు తాలిబన్ల దుశ్చర్యలకు బలవుతున్నారు. ఈ ఎయిర్‌పోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఇక్కడ ఉంటున్న అఫ్ఘాన్‌వాసులు, ఇతర దేశాలకు చెందినవారు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని కాలం గడుపుతున్నారు.
కనీసం తాగేందుకు మంచి నీటి కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆహారం దొరికితే చాలు అని జీవనం గడుపుతున్నారు. ఆహరం అందక కొందరు నీరసంతో సొమ్మసిల్లిపోతున్నారు. ఎయిర్ పోర్టు బయట తాగునీటిని, ఆహారాన్ని అత్యధిక ధరలకు విక్రయిస్తున్నారు. నీళ్ల బాటిల్ 40 డాలర్లు అంటే సుమారు రూ. 3వేలుగా నిర్ణయించారు. ఒక ప్లేట్ రైస్ 100 డాలర్లు భారత కరెన్సీలో రూ.7,500 అమ్ముతున్నారు.
దీనికితోడు ఇక్కడ ఆహార పదార్థాలను అప్ఘానిస్తాన్ కరెన్సీకి బదులుగా, డాలర్లలో విక్రయిస్తుండటంతో అఫ్ఘాన్‌వాసులు పలు ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. ఇంతటి దుర్భర స్థితిలో ఉన్న ప్రజలకు తాలిబన్లు సాయం చేయకపోగా, వారిపై దాడులకు తెగబడుతున్నారు.
ఇవి కూడా చదవండి: Havana Syndrome: అఫ్గానిస్తానీయుల తరలింపులో అంతు చిక్కని సమస్య.. అదృశ్య శక్తులు దాడి చేస్తున్నాయంటున్న అమెరికా అధికారులు..