Afghanistan Crisis: అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి చదువుకోకూడదు.. ఇస్లామిక్ దుస్తులు ధరించడం తప్పనిసరి..

Afghanistan Crisis: ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశమైన నాటినుంచి అరచకాలు మొదలయ్యాయి. దీంతో ఆప్ఘనిస్తాన్ ప్రజలు కంటి మీద కునుకులేకుండా తీవ్ర భయాందోళన చెందుతున్నారు.

Afghanistan Crisis: అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి చదువుకోకూడదు.. ఇస్లామిక్ దుస్తులు ధరించడం తప్పనిసరి..
Afghan Women

Afghanistan Crisis: ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశమైన నాటినుంచి అరచకాలు మొదలయ్యాయి. దీంతో ఆప్ఘనిస్తాన్ ప్రజలు కంటి మీద కునుకులేకుండా తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే తాలిబన్లు కఠినమైన షరియా చట్టాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయితో సహా అన్ని యూనివర్సిటీల్లో మహిళలు చదువుకోవచ్చని తాలిబాన్ విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. కానీ ఇస్లామిక్ దుస్తులు ధరించడం తప్పనిసరి చేశారు. మంత్రి అబ్దుల్ బాకీ హక్కానీ ఆదివారం విలేకరుల సమావేశంలో ఈ కొత్త విధానాలను వెల్లడించారు. అయితే కొత్తగా ఏర్పడిన తాలిబాన్ ప్రభుత్వంలో ఒక్క మహిళ కూడా ఉండకపోవడం గమనార్హం.

విశ్వవిద్యాలయాలలో మహిళా విద్యార్థులు హిజాబ్ ధరించాల్సి ఉంటుందని మంత్రి అబ్దుల్ బాకీ హక్కానీ అన్నారు. అయితే తలకు మాత్రమే స్కార్ఫ్ ధరించాలా లేక ముఖం కప్పుకోవడం కూడా తప్పనిసరియా అనే విషయాన్ని స్పష్టంగా వివరించలేదు.1990ల చివరలో ప్రభుత్వాన్ని నడిపిన తాలిబాన్లు చాలా రాక్షసంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో బాలికలు, మహిళలు విద్యకు దూరంగా ఉండేవారు. అలాగే ప్రజా జీవితంలో పాల్గొనవద్దు. కానీ ఇప్పుడు మహిళల విషయంలో కొద్దిగా మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది.

అబ్బాయిలు మరియు అమ్మాయిలు కలిసి చదువుకోకూడదు..
అబ్దుల్ బాకీ హక్కానీ మాట్లాడుతూ.. 20 సంవత్సరాల క్రితం ఉన్న చట్టాలను తాలిబాన్లు అమలు చేయడం లేదన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు దగ్గట్లుగానే ప్రభుత్వాన్ని నిర్మించడంలో బిజీగా ఉన్నామని తెలిపారు. అయితే లింగ వివక్ష అమలు ఉంటుందన్నారు. బాలురు, బాలికలు కలిసి చదువుకోవడానికి తాము అనుమతించమని ప్రకటించారు. కో- ఎడ్యుకేషన్ అస్సలు ఉండదన్నారు. మహిళా విద్యార్థులకు కేవలం మహిళా టీచర్లు మాత్రమే బోధించాలని ఆదేశాలు జారీ చేసింది.1990ల చివరలో తాలిబాన్లు సంగీతం, కళలను కూడా నిషేధించారు.

అఫ్గాన్ మహిళలు క్రికెట్‌తో సహా ఎలాంటి క్రీడల్లో పాల్గొనరు. ఎందుకంటే క్రీడలు వారి శరీరాలను బహిర్గతం చేస్తాయని అందుకే వాటిపై నిషేధం విధిస్తున్నట్లు తాలిబాన్లు ప్రకటించారు. మహిళలకు క్రీడా కార్యకలాపాలు అవసరం లేదని తాలిబాన్ సాంస్కృతిక కమిషన్ డిప్యూటీ హెడ్ అహ్మదుల్లా వాసిక్ మీడియాతో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆఫ్ఘన్ మహిళా క్రికెట్ జట్టు కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Viral Video: 2 గంటలు చిన్నారి మెడను చుట్టిన నాగుపాము.. కానీ చివరకు మాత్రం

Black Pepper Tea: ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి నల్ల మిరియాల టీతో ఎన్నో ప్రయోజనాలు.. ఎంటో తెలుసా..

Kailash Mountain Mystery: కైలాస పర్వత రహస్యం ఏంటి..! శివుడు నిజంగానే అక్కడ ఉన్నాడా..?

Click on your DTH Provider to Add TV9 Telugu