Al Khaida: అల్ ఖైదా నాయకుడు ఐమాన్ అల్ జవహరి సజీవంగా ఉన్నాడు.. వీడియో విడుదల చేసిన తాలిబన్లు!

అల్ ఖైదా నాయకుడు ఐమాన్ అల్ జవహరి కొత్త వీడియో వెలుగులోకి వచ్చింది. అమెరికాలో 9/11 దాడుల 20 వ వార్షికోత్సవం సందర్భంగా ఈ వీడియో సోషల్ మీడియాలో కనిపించింది.

Al Khaida: అల్ ఖైదా నాయకుడు ఐమాన్ అల్ జవహరి సజీవంగా ఉన్నాడు.. వీడియో విడుదల చేసిన తాలిబన్లు!
Al Khaida
Follow us

|

Updated on: Sep 12, 2021 | 7:51 PM

Al Khaida: అల్ ఖైదా నాయకుడు ఐమాన్ అల్ జవహరి కొత్త వీడియో వెలుగులోకి వచ్చింది. అమెరికాలో 9/11 దాడుల 20 వ వార్షికోత్సవం సందర్భంగా ఈ వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. నిజానికి గతేడాది డిసెంబర్‌లో జవహరి మరణ వార్త వచ్చింది. అప్పుడు అతను చాలా అనారోగ్యంతో ఉన్నాడని.. దీని కారణంగా అతను మరణించాడని వార్తలు వచ్చాయి. ఈ వార్తలను అంతర్జాతీయ సమాజం కూడా ధృవీకరించింది. అయితే, ఇప్పుడు వెలుగులోకి వచ్చిన వీడియో జవహరి బ్రతికే ఉన్నట్లు నిర్దారించింది.

జిహాది గ్రూపుల ఆన్‌లైన్ కార్యకలాపాలను పర్యవేక్షించే అమెరికన్ ఆర్గనైజేషన్ సైట్ (SITE) ఇంటెలిజెన్స్ గ్రూప్ జవహరి కొత్త వీడియో గురించి అమెరికన్ ఇంటెలిజెన్స్ గ్రూప్ తో ఈ సమాచారం పంచుకుంది. జవహరి తన వీడియోలో అనేక సమస్యల గురించి మాట్లాడినట్లు ఇది పేర్కొంది.

సైట్ డైరెక్టర్ రీటా కేజ్ సోషల్ మీడియాలో మాట్లాడుతూ – జవహరి మరణం గురించి అనేక నివేదికలు వినిపించాయి. అతను ఇప్పుడు కొత్త 60 నిమిషాల వీడియోలో కనిపించాడు. ఇప్పుడు అతను జీవించి ఉన్నాడని రుజువు అవుతోంది.

రష్యన్ స్థావరంపై దాడిని ప్రస్తావిస్తూ

రీటా చెబుతున్న దాని ప్రకారం, జనవరి 1 న, సిరియాలోని రష్యా సైనిక స్థావరంపై దాడి జరిగింది. అల్ ఖైదా అనుబంధ సంస్థ హురాస్ అల్-డి ఈ దాడికి పాల్పడినట్లు జవాహిరి కొత్త వీడియోలో తెలిపారు. వీడియో క్లిప్ ప్రారంభంలో జవహరి రక్షణ కొరకు పిలుపుచ్చించి. ఇంకా ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే.. ఇందులో తాలిబాన్ కు సంబంధించిన కొన్ని క్లిప్‌లు కూడా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల విజయం అల్ ఖైదా విజయంగా ఈ వీడియోలో వర్ణించడం విశేషం .

మరికొన్ని వీడియోలు విడుదల చేస్తాం..

త్వరలో మరికొన్ని వీడియోలు, పుస్తకాలను విడుదల చేస్తామని అల్ ఖైదా మీడియా విభాగం తెలిపింది. ఈ పుస్తకాల్లో ఒకటి అల్-జవహరి వ్రాసి ఉండవచ్చు అని భావిస్తున్నారు. టెర్రరిస్ట్ సంఘటనలను ట్రాక్ చేస్తున్న పాశ్చాత్య నిపుణులు తాలిబాన్, అల్-ఖైదా మధ్య మంచి మరియు సన్నిహిత సంబంధం ఉందని నమ్ముతారు. అల్ ఖైదా ఇప్పటికే తన ప్రకటనలలో దీనిని ప్రస్తావించింది. ఒసామా బిన్ లాడెన్ మరణం తర్వాత జవహరికి అల్ ఖైదా కమాండ్ ఇచ్చారు. కానీ, 2001 తర్వాత, అమెరికా ఈ తీవ్రవాద సంస్థ వెన్ను విరిచింది. ఈ నేపధ్యంలోనే జవహరి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆ తరువాత చాలా కాలానికి అంటే 2020లో జవహరి మరణించారనే వార్తలు వచ్చాయి. వాటిని అన్నిదేశాలు నమ్మాయి.