Afghanistan Crisis: అఫ్ఘానిస్థాన్‌లో కొనసాగుతున్న తాలిబన్ల దాష్టీకాలు.. జానపద కళాకారుడు దారుణ హత్య

|

Aug 30, 2021 | 7:26 AM

ఇప్పటికే అఫ్ఘానిస్థాన్ దేశాన్ని ఆక్రమించుకున్న తాలిబన్లు.. వారి అరాచకాలకు అడ్డు అదుపు లేకుండాపోయింది. తమకు వ్యతిరేకంగా ఉన్నవారిపై దాడులకు పాల్పడుతున్నారు.

Afghanistan Crisis: అఫ్ఘానిస్థాన్‌లో కొనసాగుతున్న తాలిబన్ల దాష్టీకాలు.. జానపద కళాకారుడు దారుణ హత్య
Afghan Folk Singer
Follow us on

Afghanistan crisis: ఇప్పటికే అఫ్ఘానిస్థాన్ దేశాన్ని ఆక్రమించుకున్న తాలిబన్లు.. వారి అరాచకాలకు అడ్డు అదుపు లేకుండాపోయింది. తమకు వ్యతిరేకంగా ఉన్నవారిపై దాడులకు పాల్పడుతున్నారు. గతంలో వారిపై పోరాడిన వారిపై పగ తీర్చుకుంటున్నారు. తాజాగా అఫ్ఘానిస్థాన్‌కు చెందిన ప్రముఖ జానపద కళాకారులు ఫవాద్ అందరాబీని అతి కిరాతకంగా హతమార్చారు. ఈ వివరాలను బాధిత కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ విషయమై జవాద్ అందరాబీ మాట్లాడుతూ.. కొద్ది రోజుల క్రితమే కొందరు తాలిబనులు తమ ఇంటికి వచ్చి అందరాబీతో కలిసి టీ తాగారన్నారు. కానీ, ఇంతలోనే తమ తండ్రిని హత్యచేశారని ఆవేదన వ్యక్తం చేవారు. ఇదిలావుంటే, తిరుగుబాటుదారేలే ఫవాద్ అందరాబీని చంపి ఉంటారని తాలిబన్లు చెబుతున్నారు. అయితే, ఈ హత్యపై బాధితుడి కుమారుడు జవాద్ అంబరాబీ స్థానిక తాలిబాన్ కౌన్సిల్‌ను ఆశ్రయించాడు. తన తండ్రిని హత్య చేసిన వారిని గుర్తించి శిక్షిస్తామని కౌన్సిల్ హామీ ఇచ్చినట్లు ఆయన చెప్పారు. తాలిబన్ల ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ సైతం ఈ ఘటనపై స్పందించారు. ఈ హత్యకు కారణమైన తిరుగుబాటుదారులను శిక్షిస్తామని ఆయన చెప్పడం విశేషం.

ఇదిలా ఉంటే.. తాలిబన్ల వశమైన అఫ్గానిస్థాన్ లో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. ఓ వైపు తాలిబన్ల ఆకృత్యాలు, మరో వైపు ఉగ్రవాదుల భయాల నడుమ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తాలిబన్ల కింద బతకలేమని భావించిన అనేక మంది దేశాన్ని వీడేందుకు చేస్తున్న ప్రయత్నాలు కన్నీటిని పెట్టిస్తున్నాయి. నిత్యం వేలాదిగా ప్రజలు దేశం దాటడానికి ఏకైక మార్గం అయిన కాబుల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటున్నారు. సాధారణ బస్సుల్లో ప్రయాణిస్తున్నట్లు విమానాలు జనంతో కిక్కిరిసిపోతున్నారు. మరోవైపు, ఆదివారం కాబూల్ ఎయిర్‌పోర్టుకు అత్యంత సమీపంలో జరిగిన రాకెట్ దాడిలో వందలాది మంది జనం గాయపడ్డారు.

మరోవైపు, అక్కడి బ్యాంకుల్లో డబ్బులు లేకపోవడం మరో ఆందోళనకు కారణమైంది. దాదాపుగా ఆరు నెలల నుంచి వేతనాలు రాక ప్రజలు అక్కడ బ్యాంకుల ఎదుట నిరసనకు దిగుతున్నారు. ప్రజలకు కూడా ఏటీఎంల వద్ద డబ్బులను తీసుకోవడానికి బారులుతీరుతూ కనిపిస్తున్నారు. తాజాగా న్యూ కాబుల్ బ్యాంకు ఎదుట ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. మూడు నుంచి ఆరునెలల పాటు వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని ఆందోళన చేస్తున్న ఉద్యోగులు వాపోయారు. తమ వేతనాలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.

Read Also… TTD Electrical Cars: ఇక, తిరుమల కొండపై ఎలక్ట్రిక్ కార్లు.. పర్యావరణ పరిరక్షణకు టీటీడీకి అరుదైన గుర్తింపు..!

 Pelli SandaD: రాఘవేంద్రరావు సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్న అప్పటి సౌందర్య లహరి..