Afghanistan Crisis: డెడ్‌లైన్‌కి ఒక రోజు ముందే ఆఫ్ఘాన్‌ను వీడిన అమెరికా.. కాబూల్ విమానాశ్రయాన్ని వీడి తిరుగుముఖం పట్టిన ఆర్మీ

ఆఫ్ఘానిస్థాన్ నుంచి అమెరికా రక్షణ దళాలు పూర్తిస్థాయిలో వెనుతిరిగాయి. సోమవారం అర్థరాత్రి అమెరికా సైన్యంతో కూడిన చివరి విమానం కాబూల్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరింది.

Afghanistan Crisis: డెడ్‌లైన్‌కి ఒక రోజు ముందే ఆఫ్ఘాన్‌ను వీడిన అమెరికా.. కాబూల్ విమానాశ్రయాన్ని వీడి తిరుగుముఖం పట్టిన ఆర్మీ
American Army
Follow us

|

Updated on: Aug 31, 2021 | 8:34 AM

Afghanistan Crises – US finishes withdrawal: ఆఫ్ఘానిస్థాన్ నుంచి అమెరికా రక్షణ దళాలు పూర్తిస్థాయిలో వెనుతిరిగాయి. సోమవారం అర్థరాత్రి అమెరికా సైన్యంతో కూడిన చివరి విమానం కాబూల్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరింది. 20 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత అమెరికా తన సేనలను ఉపసంహారించుకుంది. కొన్ని నెలలుగా అఫ్ఘన్ నుంచి తమ సేనలను, అక్కడ తమకు ఆశ్రయం ఇచ్చిన కొందరు ఆప్ఘన్ పౌరులను అమెరికా తరలిస్తున్న అగ్రరాజ్యం.. సోమవారం ఆ పనిని పూర్తి చేసినట్టు ప్రకటించింది.

సోమవారం అర్థరాత్రి కాబూల్ నుంచి చివరి విమానం బయలుదేరినట్టు యుఎస్ సెంట్రల్ కమాండ్ అధిపతి జనరల్ ఫ్రాంక్ మెకెంజీ తెలిపారు. సుమారు రెండు వారాల పాటు ఆఫ్ఘన్ నుంచి తమ సేనలను, కొంతమంది ఆఫ్ఘన్ పౌరులను తీసుకొచ్చేందుకు అగ్రరాజ్యం ఎయిర్‌లిఫ్ట్ చేపట్టింది. ఈ క్రమంలో ఆగస్టు 26న జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 13 మంది అమెరికా దళాలకు చెందిన సైన్యం, దాదాపు 169 మంది ఆఫ్ఘన్ పౌరులు మరణించారు. అనంతరం చోటుచేసుకున్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆగస్టు 15న తాలిబాన్లు ఆఫ్ఘన్ రాజధాని కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నారు. తాము ఆఫ్ఘనిస్థాన్ నుంచి వైదొలిగిన తరువాత ఆ దేశం మళ్లీ తాలిబన్ల వశమవుతుందని అమెరికా ముందుగానే అంచనా వేసింది. అయితే, ఇంత తొందరగా తాలిబన్లు ఆఫ్ఘన్‌ను తమ ఆధీనంలోకి తీసుకుంటారని ఊహించలేదంటూ అమెరికా జోబైడెన్ ప్రకటించారు.

దీంతో అఫ్గాన్‌లో సైనికులు, పౌరుల తరలింపు ప్రక్రియ పూర్తయింది’’ అని యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ హెడ్‌ జనరల్‌ మెకంజీ పెంటగాన్‌లో ప్రకటించారు. దీంతో అధ్యక్షుడు జోబైడెన్‌ విధించిన ఆగష్టు 31 గడువు తేదీలోపే అమెరికా దళాలు అఫ్గాన్‌ను ఖాళీ చేశాయి. అయితే గత వారం రోజుల నుంచి కాబుల్‌లో చోటుచేసుకున్న బాంబు దాడుల నేపథ్యంలో భారీ భద్రత నడుమ ఈ విమానం బయలుదేరింది. మొదటి నుంచి ఇరు పక్షాల మధ్య తీవ్ర శత్రుత్వం ఉన్నప్పటికీ అఫ్గాన్‌ నుంచి అమెరికా దళాలు, పౌరుల ఉపసంహరణలో తాలిబన్లు చాలా సహకరించారని, ఉపయుక్తంగా ఉన్నారని ఈ సందర్భంగా జనరల్ ఫ్రాంక్ మెకెంజీ పేర్కొన్నారు.

దీంతో అక్కడి నుంచి తమ సైన్యాన్ని రప్పించేందుకు అమెరికా ప్రభుత్వం వడివడిగా అడగులు వేసింది. తన రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేసింది. అనంతరం అసాధారణమైన ఎయిర్‌లిఫ్ట్ ప్రక్రియను చేపట్టింది. ఈ క్రమంలో కాబూల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో అమెరికా ఊహించిన విధంగానే పేలుళ్లు జరిగాయి. ఆ దాడి జరిగిన స్పందించిన అమెరికా అధ్యక్షుడు బైడెన్ … ఆఫ్ఘనిస్థాన్ నుంచి వైదొలగాల్సిన తన అభిప్రాయాన్ని మరోసారి సమర్థించుకున్నారు. 20 సంవత్సరాల యుద్ధాన్ని ముగించాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. మరోవైపు, అమెరికా దళాలు అఫ్గానిస్థాన్‌ను పూర్తిగా ఖాళీ చేయడంతో తాలిబన్లు తుపాకులతో గాల్లోకి కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు.

20 ఏళ్ల క్రితం 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై జరిగిన దాడికి ప్రతీకారంగా… ఉగ్రవాద సంస్థ ఆల్‌ఖైదా, దాని అధినేత బిన్ లాడెన్‌ను హతమార్చడమే లక్ష్యంగా ఆఫ్ఘనిస్థాన్‌లోకి అడుగుపెట్టింది అమెరికా. ఇందుకోసం ఆ దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. ఆల్‌ఖైదాకు ఆశ్రయం కల్పించిన తాలిబన్ల చెర నుంచి ఆఫ్ఘనిస్థాన్‌కు విముక్తి కల్పించింది. రెండు దశాబ్దాల పాటు ఆఫ్ఘనిస్థాన్‌ తాలిబన్ల వశం కాకుండా అడ్డుకుంది.ఈ ఏడాది బిడెన్ అధికారం చేపట్టే సమయానికి ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న 2,500 మంది సైనికులను నిలుపుకోవాలని వాదించిన తన జాతీయ భద్రతా బృందంలోని సభ్యుల సలహాలను ఆయన పరిశీలించారు.

Read Also…  China Video Games: ఆన్‌లైన్‌ గేమ్స్‌ కట్టడికి చైనా కీలక నిర్ణయం.. ఇకపై వారంలో కేవలం మూడు గంటలే.