ఓ వైపు తాలిబన్లు పంజ్ షిర్ లోయను చుట్టుముట్టి ఉండగా మరోవైపు మాజీ ఉపాధ్యక్షుడు, తనను తాను ఆఫ్ఘన్ ఆపద్ధర్మ అధ్యక్షుడిగా ప్రకటించుకున్న అమ్రుల్లా సలెహ్ తన అనుచరులతో వాలీబాల్ ఆడుతున్న ఫోటోలు,వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరునవ్వుతో ఈయన అక్కడ నిలబడిన దృశ్యాలు.. మరో ఇద్దరు సాయుధ వ్యక్తులు కూడా వీటిలో కనిపిస్తున్నారు. తాలిబాన్లపై తన ఆఫ్ఘన్ రెజిస్టెన్స్ ఫోర్స్ బలగాలతోను, స్థానిక మిలీషియా సభ్యులతోను కలిసి ఆయన పోరు జరుపుతున్నాడు. యాంటీ సోవియట్ ముజాహిదీన్ కమాండర్ అహమద్ షా మసూద్ కుమారుడు కూడా ఈ పోరాటంలో ఆయనకు తోడయ్యాడు. దేశంలో అధ్యక్షుడు లేడు గనుక న్యాయబద్ధంగా తానే ఆపద్ధర్మ అధ్యక్షుడినని సలెహ్ ప్రకటించుకున్నప్పటికీ..ఏ దేశం కూడా లేదా ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థ కూడా ఆయనను ఇంకా గుర్తించలేదు. కనీసం ఆయన ప్రకటనలను గానీ తాలిబాన్లపై ఆయన జరుపుతున్న పోరును గానీ ప్రస్తావించడం లేదు. ఆఫ్ఘన్ లో అన్ని రాష్ట్రాలూ తాలిబన్ల వశమైనా.. ఈ లోయ మాత్రం వారికి కొరకరాని కొయ్యగానే ఉంటోంది.
ఇక్కడ వారికి గట్టి ప్రతిఘటన ఎదురవుతోంది. 2001 లో కూడా ఈ వ్యాలీలో వారికి చుక్కెదురైంది. అహమద్ మసూద్ తో చర్చలు విఫలమైన అనంతరం తాము ఈ లోయను చుట్టుముట్టామని తాలిబన్ ఫైటర్లు నిన్న ప్రకటించారు. రక్తపాతాన్ని నివారిస్తామని, కానీ తాలిబాన్లకు లొంగిపోయే ప్రసక్తే లేదని అహ్మద్ మసూద్ ప్రకటించాడు. దేశంలో అన్ని పక్షాలతో కూడిన ప్రభుత్వం ఏర్పడాలని, శాంతి,నెలకొనేలా చూడాల్సి ఉందని అంటున్న ఈయన.. తాలిబన్లు ఈ లోయలో ప్రవేశిస్తే మాత్రం తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుందని హెచ్చరించాడు. అటు-కాబూల్ విమానాశ్రయంలో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. దేశం నుంచి పారిపోయేందుకు వేలమంది ప్రయత్నిస్తున్నారు.
Watch this video who is playing?
You might know him #panjshir is peaceful & United pic.twitter.com/gS0wtXnle4— Panjshir_Province (@PanjshirProvin1) August 22, 2021
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: బెడిసికొట్టిన బుల్లెట్ సాంగ్..! కట్ చేస్తే.. ఉద్యోగం ఫట్.! వీడియో
రామునిపల్లి గ్రామంలో ఆనాదిగా వస్తున్న వింత ఆచారం.. పాచి ముఖాలతో పూజలు.. వీడియో